అమెరికా అణు కమాండ్ సెంటర్ వద్ద ట్రంప్ 'డూమ్స్‌డే ప్లేన్' చక్కర్లు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర కమాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ అనుమానాస్పదంగా ఒక అమెరికా సైనిక స్థావరం వద్ద చక్కర్లు కొట్టింది. ప్రస్తతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి డూమ్స్‌డే ప్లేన్ ఇలా చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది.
ఈ డూమ్స్ డే విమానం నెబ్రాస్కాలోని ఓఫట్ ఎయిర్ ఫోర్స్ బేస్ పైన దాదాపు ఆరు సార్లు చక్కర్లు కొట్టినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ద్వారా సమాచారం తెలిసింది. అయితే యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. ఈ విమానం చక్కర్లు కొట్టడం కేవలం సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగమేనని స్పష్టం చేసింది. దీనికి యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. మరోవైపు ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ విమానం అణు కేంద్రంపై కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం వేళ ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ మరో 7 గంటల్లో ముగియనుంది. ఇక ఇప్పటికే ఈ రాత్రికి ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని ఇప్పటికే ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకంగా మారనుందన్నారు. ట్రంప్ మాటలను బట్టి చూస్తే ఇరాన్ పై న్యూక్లియర్ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications