ట్రంప్ సంచలనం.. 10 నుంచి 15 శాతానికి సుంకాలు పెంపు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ దేశాలపై ప్రస్తుతం 10 శాతం ఉన్న టారిఫ్ ను 15 శాతానికి పెంచారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. మరోవైపు ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్ ల విషయంలో ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా ట్రంప్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) లో భాగంగా ప్రపంచ దేశాలపై టారిఫ్ లు విధించడం, అక్రమ వలసవాదులను తిరిగి స్వదేశాలకు తరలించడం, స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దగ్గాలన్న కారణంతో వీసా రూల్స్ ను కఠినతరం చేయడం లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని పటిష్టంగా అమలు చేసుకుంటూ వచ్చారు. అయితే ప్రపంచ దేశాలపై ట్రంప్ యంత్రాంగం విధించిన టారిఫ్ లపై ఆ దేశ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ టారిఫ్​ లు రాజ్యంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది.

Trump Hikes Global Tariffs From 10 to 15 on World Goods Economic Shockwaves Trade War Fears Loom

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రపంచ దేశాలపై 10 సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. భారత్​ కూడా 10 శాతం సుంకం చెల్లించాలని పేర్కొన్నారు. పెంచిన ఈ సుంకాలు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ సర్కార్ వెల్లడించింది. ఇవి 150 రోజుల పాటు అమల్లో ఉంటాయని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును హాస్యాస్పదంగా పేర్కొన్న ట్రంప్ ఈ మేరకు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ దేశాలపై 10 శాతం టారిఫ్ లు విధించిన కొద్ది గంటల్లోనే వాటిని 15 శాతానికి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. తాజాగా పెంచిన ఈ టారిఫ్ లు 150 రోజులపాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది వైట్ హౌజ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+