టిల్లర్‌సన్‌తో విభేధిస్తా, తొలగించను, మైఖేల్ ఫ్లిప్ తప్పుడు సమాచారం: ట్రంప్ ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాలో చోటు చేసుకొంటున్న పరిణామాలు ట్రంప్ పాలనపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టిల్లర్ సన్‌తో విభేధాలు, మరో వైపు మాజీ భద్రతా సలహదారు మైఖేల్ ప్లిన్ వ్యవహరంతో ట్రంప్ ఇబ్బంది పడుతున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన కొద్ది రోజులకే ఆయన తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ట్రంప్‌ను పదవి నుండి వైదొలగాలంటూ నిరసన ప్రదర్శనలు కూడ సాగాయి.

ట్రావెల్ బ్యాన్‌ లాంటి నిర్ణయాలు ట్రంప్‌పై తీవ్రంగా ప్రభావం చూపాయి. అయితే ఇటీవల కొంత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయనే అభిప్రాయం నెలకొంది. కానీ, అదే సమయంలో విదేశాంగ శాఖ మంత్రి టిల్లర్‌సన్‌తో విభేధాలు మరోసారి గుప్పుమన్నాయి.

వరుస ఘటనలపై ట్రంప్ ట్వీట్లు

వరుస ఘటనలపై ట్రంప్ ట్వీట్లు

అమెరికాలో ఇటీవల చోటు చేసుకొంటున్న ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా తన వైఖరిని వెల్లడిస్తున్నారు. ఓవైపు విదేశాంగ శాఖ మంత్రి టిల్లర్‌సన్‌తో విభేధాలు.. మరోవైపు మాజీ భద్రతా సలహాదారు మైకేల్‌ ఫ్లిన్‌ వ్యవహారం వెలుగులోకి రావటంతో ట్రంప్ ట్వీట్ చేశారు. ఉపాధ్యక్షుడికి, ఎఫ్‌బీఐకి అబద్ధాలు చెప్పటం వల్లే ఫ్లిన్‌ను తొలగించాల్సి వచ్చిందని.. అతను చేసింది సిగ్గుపడాల్సిన విషయమని.. అందులో దాచేందుకు ఏం లేదని ట్రంప్ ట్విట్టర్‌లో ప్రకటించారు.

టిల్లర్‌సన్‌తో విభేధాలు

టిల్లర్‌సన్‌తో విభేధాలు

అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టిల్లర్‌సన్‌తో ట్రంప్‌కు విభేధాలున్నాయని పలు దఫాలు బహిర్గతమైంది. విదేశీ పర్యటనలో ఉన్న టిల్లర్‌సన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇక ట్రంప్‌ కు, టిల్లర్‌ సన్‌ కు విభేదాలు తారస్థాయికి చేరాయనే ప్రచారం సాగుతోంది.ట్రంప్ విదేశాంగ విధానంపై టిల్లర్ సన్‌ గతంలోనే బహిరంగంగా మండిపడ్డారు.

 ట్రంప్ తీరుపై టిల్లర్‌సన్ ఇలా...

ట్రంప్ తీరుపై టిల్లర్‌సన్ ఇలా...

ఉత్తరకొరియా, ఇరాన్, కొన్ని అరబ్బు దేశాలతో ట్రంప్ వైఖరి సరిగ్గాలేదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టిల్లర్ సన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు ట్రంప్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ట్రంప్ మూర్ఖుడని టిల్లర్‌సన్ అభిప్రాయపడ్డారు. టిల్లర్‌సన్‌ను తొలగిస్తారని మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. ఈ విషయమై ట్వీట్ చేసిన ట్రంప్ టిల్లర్‌సన్‌ను తొలగించడం లేదని ప్రకటించారు.

టిల్లర్‌సన్‌తో విభేదిస్తా.. కానీ,

టిల్లర్‌సన్‌తో విభేదిస్తా.. కానీ,

అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టిల్లర్‌సన్‌తో విభేదిస్తా కానీ, అతడిని మాత్రం తొలగించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దైన శైలిలో ప్రకటించారు.
ఇద్దరం కలిసి పనిచేస్తాం అని ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే తమ మధ్య విభేధాలున్నాయనే విషయాన్ని ఆయన ఒప్పుకొన్నాడు.

ఒబామా చురకలు

ఒబామా చురకలు

అమెరికా మాజీ అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా డొనాల్డ్ ట్రంప్‌ పై పరోక్షంగా చురకలు అంటించారు.'మాట్లాడ‌టానికి ముందు ఆలోచించండి అన్నది ట్విట్ట‌ర్‌కి కూడా వ‌ర్తిస్తుంది. అందుకే ట్వీట్ చేసే ముందు ఒక‌సారి ఆలోచించండని ఒబామా పరోక్షంగా ట్రంప్‌కు చురకలంటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Donald Trump in a tweet on Saturday said he fired his former National Security Adviser Michael Flynn because Flynn lied to the vice president — and the FBI.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి