సిరియా నరమేథంపై ట్రంప్ ఫైర్: ఇక ఉపేక్షించేది లేదని వ్యాఖ్య..

సిరియాలో కెమికల్ ఎటాక్(రసాయన దాడి)కి పాల్పడి ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాదులు హద్దులు దాటారని ట్రంప్ మండిపడ్డారు.

వాషింగ్టన్: సిరియాలో జరుగుతున్న నరమేథంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో స్పందించారు. గత ఒబామా ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదని, ఈ సమస్య పరిష్కారానికి తనవంతు బాధ్యత నిర్వర్తించడం తనకు లభించిన గొప్ప అవకాశం అని అన్నారు.

బుధవారం నాడు జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో ట్రంప్ రోజ్ గార్డెన్ లో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు. సిరియాలో కెమికల్ ఎటాక్(రసాయన దాడి)కి పాల్పడి ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాదులు హద్దులు దాటారని ట్రంప్ మండిపడ్డారు.

Trump: 'I now have responsibility' when it comes to Syria

ఇక దీన్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, ఐరాస సంకీర్ణ దళాలు సహకరించకపోయినా అమెరికా సైన్యాన్ని సిరియాకు పంపిస్తామని ట్రంప్ అన్నారు. రసాయన దాడిలో వేలాది మంది చిన్నారులు మృత్యువాత పడటం తీవ్రంగా కలచివేసిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను అంతమొందించడం తన బాధ్యత అని, ఇక దానిపైనే ప్రత్యేక దృష్టిని సారిస్తానని తెలిపారు.

సిరియాలో శాంతిని నెలకొల్పడంలో ఐరాస విఫలమవతుందని, ఇంతకన్నా ఘోరమైన దుర్ఘటనలను తాను ఇంతవరకు చూడలేదని ట్రంప్ చెప్పారు. కాగా, సిరియాలో రసాయన దాడిపై అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుశ్చర్య వెనుక ఆయనే ఉన్నారని పలువురు బలంగా వాదిస్తున్నారు. బషర్ అల్ అసద్ మాత్రం ఆరోపణలను ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+