• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా అధ్యక్షుడు మళ్లీ దొరికాడు: ట్విటర్‌లో ట్రంప్‌ను ఆటాడేసుకుంటున్న నెటిజెన్లు

|

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు జారడం చాలా కామన్. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. అమెరికా మధ్యప్రాచ్య ప్రాంతంలో రానున్న కాలంలో చలితీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ చలిని తట్టుకోవాలంటే భూతాపం పెరగాల్సిందే అంటూ ట్వీట్ చేసి విమర్శలపాలయ్యారు. ఈ ట్వీట్ చూసిన నెటిజెన్లు వాతావరణంను కాపాడుకోవాల్సింది పోయి అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ట్వీట్లు చేయడంపై దుమ్మెత్తిపోశారు. అదే సమయంలో ఆయన ట్వీట్‌ను లైక్ చేసిన వారు కూడా భారీ సంఖ్యలోనే ఉండటం విశేషం.

గ్లోబల్ వార్మింగ్ స్పెల్లింగ్ రాదంటూ విమర్శలు

ట్రంప్ చేసిన ట్వీట్‌లో మరో తప్పు దొర్లినట్లు నెటిజెన్లు కనిపెట్టారు. గ్లోబల్ వార్మింగ్‌లో అక్షర దోషాలు ఉన్నాయన్నారు. ట్రంప్‌కు గ్లోబల్ వార్మింగ్‌కు స్పెలింగ్ కూడా రాదని అలాంటి ఆయన అధ్యక్ష పదవిలో కూర్చోవడం దురదృష్టకరమన్నారు. అంతకుముందు కూడా ట్రంప్ పెట్టిన చాలా ట్వీట్స్‌లో అక్షరదోషాలను నెటిజెన్లు కనిపెట్టి ట్రంప్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ విషయం ట్రంప్ దృష్టికి కూడా వచ్చింది. అయినప్పటికీ ఇంకా అక్షరదోషాలు వస్తూనే ఉన్నాయి. ట్రంప్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని నెటిజెన్లు విమర్శించారు.

పారిస్ వాతావరణం ఒప్పందం నుంచి తప్పుకున్న ట్రంప్

ఇక వాతావరణాన్ని పరిరక్షించుకోవాలని భారత్‌తో సహా చాలా ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి 2017లో జరిగిన పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ ట్రంప్ మాత్రం ఇందుకు నిరాకరించారు. గాలిలో కార్బన్ ఉద్గారాలు తగ్గించి వాతావరణంను కాపాడుకోవాల్సి బాధ్యత ప్రతి దేశానికి ఉందని చెబుతూ పారిస్ వాతావరణ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అయితే ట్రంప్ ఇందుకు నిరాకరించారు.

మైనస్ 60 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు

మైనస్ 60 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు

ఇదిలా ఉంటే మిడ్ వెస్ట్ అమెరికాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు మైనస్ 50 డిగ్రీల ఫారెన్‌హీట్ నుంచి 60 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు తాకుతున్నాయి. దీంతో ప్రజలు చలికి తట్టుకోలేక బయటకు అడుగు పెట్టడం లేదు. రానున్న రోజుల్లో అక్కడ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ అక్కడ నమోదైంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం గత ఇరవై ఏళ్లలో ఇది తొలిసారి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The "covfefe" ghost is back. US President Donald Trump on Monday (January 28) evening made yet another tweet mocking the phenomenon of global warming and was roasted in turn by the social media users. He also spelled global warming as "Global Waming" giving enough hint that his past goofups with spellings haven't yet taught him a lesson.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more