హెచ్చరికలు వద్దు, ప్రపంచమే చూడని విధంగా దెబ్బ తింటారు: ఉ.కొరియాకు ట్రంప్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా సమీపంలో అణుదాడి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉత్తర కొరియా హెచ్చరికలు చేయడంపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు.

హెచ్చరికలు చేయకుంటే మంచిది

హెచ్చరికలు చేయకుంటే మంచిది

మంగళవారం ఆయన కూడా ఉత్తర కొరియాకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు ఎలాంటి హెచ్చరికలు చేయకుంటేనే ఉత్తర కొరియాకు మంచిదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.

North Korea vs US : Donald Trump issued an Ultimatum To Kim Jong-un
ప్రపంచం ఇప్పటి వరకు చూడని విధంగా

ప్రపంచం ఇప్పటి వరకు చూడని విధంగా

ఉత్తర కొరియా ఇలాగే హెచ్చరికలు చేస్తే ఇంతకుముందు ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా ఆగ్రహాన్ని, ఆవేశాన్ని చవి చూస్తుందని చెప్పారు. తద్వారా ప్రపంచం ఇప్పటి వరకు చూడని విధంగా ఉత్తర కొరియాకు బుద్ధి చెబుతామని అభిప్రాయపడ్డారు.

వరుసగా అమెరికాకు హెచ్చరికలు

వరుసగా అమెరికాకు హెచ్చరికలు

క్షిపణి ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియా జులైలో రెండు ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. అమెరికా మొత్తాన్ని నాశనం చేసేంత సామర్థ్యం గల క్షిపణులను తయారు చేస్తున్నట్లు అప్పుడు ప్రకటించింది. తాజాగా అణుదాడికి ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పింది.

 క్షిపణి ప్రయోగాలను అమెరికా

క్షిపణి ప్రయోగాలను అమెరికా

వరుస క్షిపణి ప్రయోగాలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ప్రయోగాలకు ఉత్తర కొరియా భారీ మూల్యం చెల్లించక తప్పదు అని ట్రంప్‌ హెచ్చరికలు చేశారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ ఉత్తర కొరియా అణుదాడికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Trump on Tuesday threatened North Korea over its newly reported ability to produce miniaturized nuclear warheads that can be attached to ballistic missiles. “North Korea best not make any more threats to the United States,” Trump said. “They will be met with fire and fury like the world has never seen.” Trump previously hailed a unanimous United Nations Security Council vote over the weekend to impose new sanctions on North Korea.
Please Wait while comments are loading...