వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంపు మళ్లీ కంపయ్యాడు: అమెరికా జాతీయ జెండాకు తప్పుగా రంగులు వేసిన అధ్యక్షుడు

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమెరికా జాతీయ జెండాకు తప్పుగా రంగులు వేసిన అధ్యక్షుడు

ప్రతిసారీ కొత్త విధానాలు ప్రకటించి వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి మరో కారణంతో హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఈ సారి సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రంప్‌ను విమర్శించారు. ఇక అసలు విషయానికొస్తే... డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలీనా ట్రంప్, ఆరోగ్య శాఖ సెక్రటరీ అలెక్స్ అజార్ ఓహియోలోని ఓ పిల్లల హాస్పిటల్‌ను సందర్శించారు. పిల్లలతో కలిసి వారు అమెరికా జాతీయజెండాలకు రంగులు వేశారు. కలర్స్ వేశాక ఆ జెండాలను ట్రంప్ ముందు ప్రదర్శించారు. అయితే అమెరికా జెండాలో ఉండే లైన్లు నీలం రంగు ఉండదు. ఎరుపు తెలుపు రంగులు మాత్రమే కనిపిస్తాయి.

ఇక ట్రంప్ అమెరికా జెండాకు వేసిన కలర్స్ ఉన్న ఫోటో ట్విటర్‌లో షేర్ అయ్యింది. ఇక నెటిజెన్లు ట్రంప్‌పై తమదైన శైలిలో దుమ్మెత్తి పోశారు. కొందరు ట్రంప్ అభిమానులు మాత్రం ట్రంప్‌ను వెనుకేసుకొచ్చారు. ఆ రంగులు ట్రంప్ వేశారనేదానికి రుజువులేంటంటూ ప్రశ్నించారు. దీనికి వెంటనే మరికొందరు సమాధానంగా ట్రంప్ కలర్స్ వేస్తున్న ఫోటోను పోస్టు చేశారు. మరికొందరు ట్రంప్ రష్యా జెండా కలర్స్ వేసేందుకు ప్రయత్నించారంటూ ట్వీట్ చేశారు. అమెరికా జాతీయ జెండాకు ఎలాంటి రంగులు వేయాలో ట్రంప్‌కు సలహాలివ్వండి అంటూ ట్వీట్ చేశారు. ట్రంప్‌కు అమెరికా జాతీయ జెండా కరెక్టుగా వేయడం రాలేదు. వేరే జెండా ఏమైనా వేస్తున్నాడేమో అని మరికొందరు ట్వీట్ చేశారు.

Trump once again trolled for all worng reasons

చిన్నపిల్లలు రంగులు వేస్తున్నారు... ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉండి జాతీయ జెండాకు కరెక్టుగా కలర్స్ వేయలేకపోయిన ఈయన అమెరికా అధ్యక్షుడిగా పనికిరాడు అంటూ ట్వీట్ చేశారు. జాతీయ జెండాకు సరైన కలర్స్ వేయడం రానివాడు... ఇతర జాతీయ జెండాలను గౌరవించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా అమెరికా స్పెల్లింగ్ తప్పురాసి నెటిజెన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలపాలయ్యాడు ట్రంప్.

English summary
For a change it’s not about his policy. Donald Trump faced a lot of flak for allegedly disrespecting the US flag after colouring it wrong!The US president, his wife, and Secretary of Health and Human Services, Alex Azar, visited a children’s hospital in Ohio, where they coloured US flags with the children. And after he was done, the flag laid out in front of Trump had a stripe coloured blue and Tweeple went crazy because the US flag doesn’t have a single blue stripe on it. All the stripes are only red and white.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X