ట్రంప్ కు షాకిచ్చిన జేడీ వాన్స్! పోప్‌కు మద్దతు

ప్రపంచ వేదికపై ఇద్దరు అత్యంత శక్తివంతమైన నాయకుల మధ్య విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో బహిరంగ చర్చకు రావాలన్న ప్రతిపాదనను పోప్ లియో XIV నిర్ద్వంద్వంగా తిరస్కరించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ వ్యవహారంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రంగంలోకి దిగి పోప్‌కు మద్దతుగా నిలవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వాటికన్ - వైట్ హౌస్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను జేడీ వాన్స్ కొట్టిపారేశారు. 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన.. మీడియా కేవలం సంఘర్షణలను సృష్టించేందుకే ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. "నిజమే, కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ వాస్తవ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మీడియా వాటిని తప్పుగా చిత్రీకరిస్తోంది" అని వాన్స్ పేర్కొన్నారు. పోప్ లియో ఇచ్చిన వివరణ పట్ల ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, మతపరమైన నాయకత్వానికి, రాజకీయ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలివేట్ చేశారు.

Trump-Pope Standoff VP JD Vance Slams Media for Sensationalizing Tensions Pope Leo Denies Public Debate

నేను రాజకీయ నాయకుడిని కాదు: పోప్ లియో

ప్రస్తుతం ఆఫ్రికా పర్యటనలో ఉన్న పోప్ లియో XIV, జర్నలిస్టులతో మాట్లాడుతూ తన వైఖరిని స్పష్టం చేశారు. "నేను రాజకీయ నాయకుడిని కాదు. డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలో పాల్గొనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రపంచం నియంతల చేతిలో నాశనమవుతోందని తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌ను ఉద్దేశించినవి కావని, ఆ ప్రసంగం అంతకుముందే సిద్ధమైందని ఆయన వివరించారు. తన మాటలను ట్రంప్ విమర్శలకు ముడిపెట్టడం ఏమాత్రం సరైంది కాదని పోప్ అసహనం వ్యక్తం చేశారు.

Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..!
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..!

ఇరాన్ అణు వివాదం.. ఉద్రిక్తతలకు బీజం!

ఈ వివాదం వెనుక ఇరాన్ అణు ఆశయాల అంశం ప్రధానంగా కనిపిస్తోంది. "ఇరాన్ చేతికి అణు ఆయుధం అందకూడదు.. అది ప్రపంచానికే ప్రమాదం" అంటూ ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో పోప్ శాంతి మరియు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరు నాయకుల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు పొడసూపాయి. పోప్ నైతిక విలువలను బోధిస్తుంటే, ట్రంప్ సర్కార్ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని జేడీ వాన్స్ సమర్థించుకొచ్చారు.

జేడీ వాన్స్ అవుట్..? ట్రంప్ ఊహించని షాక్..??
జేడీ వాన్స్ అవుట్..? ట్రంప్ ఊహించని షాక్..??

నైతికత Vs పాలన

ఉపాధ్యక్షుడు వాన్స్ ఈ వివాదాన్ని చాలా చాకచక్యంగా విశ్లేషించారు. "పోప్ బాధ్యత సువార్తను బోధించడం, నైతిక సమస్యలను ఎత్తిచూపడం. ఆ సూత్రాలను పాలనలో వర్తింపజేయడం ఒక నాయకుడిగా అధ్యక్షుడి బాధ్యత" అని ఆయన వివరించారు. ఒకవైపు అధ్యక్షుడికి విధేయుడిగా ఉంటూనే, మరోవైపు పోప్ పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+