వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి అంగీకరించని ట్రంప్‌- పగ్గాలు చేపట్టేందుకు బిడెన్‌ రెడీ- అధికార మార్పిడిపై సందిగ్ధత

|
Google Oneindia TeluguNews

హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బైడెన్‌ గెలిచినా అధికార పగ్గాలు అందుకోవడం ఆయనకు అంత సులువుగా కనిపించడం లేదు. ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ అధ్యక్ష పదవి వదులుకునేందుకు డొనాల్డ్ ట్రంప్‌ అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. దీంతో అధికార మార్పిడి సునాయాసంగా జరుగుతుందా లేదా అన్న దానిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ న్యాయపోరాటం చేసేందుకు ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలతో అధికారులు కూడా ఈ విషయంలో తొందరపడరాదని భావిస్తున్నారు. దీంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

చైనాపై నిప్పులు చెరిగిన ట్రంప్‌- కరోనాతో డ్రాగన్‌ కొట్టిన దెబ్బను ఎలా మర్చిపోగలమని ప్రశ్నచైనాపై నిప్పులు చెరిగిన ట్రంప్‌- కరోనాతో డ్రాగన్‌ కొట్టిన దెబ్బను ఎలా మర్చిపోగలమని ప్రశ్న

పగ్గాలు వదలని ట్రంప్‌..

పగ్గాలు వదలని ట్రంప్‌..


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఓటమిని అంగీకరించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ సిద్దంగా లేరు. ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్‌... ఎన్నికలు జరిగిన తీరుపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం భారీగా నిధుల సేకరణకు కూడా పిలుపునిచ్చారు. కోట్లాది డాలర్ల నిధుల సేకరణ ద్వారా భారీ న్యాయపోరాటం చేయనున్నట్లు ట్రంప్‌ సంకేతాలు పంపుతున్నారు. దీంతో అధికార మార్పిడి ప్రక్రియపై ఇది భారీ ప్రభావం చూపుతోంది. ఎన్నికల్లో విజేతపై క్లారిటీ లేకుండా అధికార మార్పిడి ఎలా అని అధికారులు తలపట్టుకుంటున్నారు.

 బైడెన్‌ టీమ్‌ అప్రమత్తం...

బైడెన్‌ టీమ్‌ అప్రమత్తం...

ఎన్నికల్లో తాము గెలిచినా ట్రంప్‌ కుయుక్తులతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొనడంతో కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ శిబిరం కూడా అప్రమత్తమైంది. వెంటనే అధికార మార్పిడి చేపట్టాలని యూఎస్‌ ఫెడరల్‌ ఏజెన్సీని కోరుతోంది. అయితే ట్రంప్‌ హయాంలో నియమించిన ఈ అధికార బృందం బైడెన్‌ను లెక్క చేస్తుందా లేదా అన్నది త్వరలో తేలిపోనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి కావాల్సిన మెజారిటీ లభించడంతో ఊపుమీదున్న బైడెన్‌-కమలా హ్యారిస్ ద్వయం అధికార మార్పిడి సజావుగా సాగాలని భావిస్తున్నారు. దీంతో అమెరికా భద్రత, ఆర్ధిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికార మార్పిడి సజావుగా సాగాలని కాబోయే అధ్యక్షుడు బైడెన్ కోరుతున్నారు.

అధికార మార్పిడి ఆలస్యం...

అధికార మార్పిడి ఆలస్యం...

ఎన్నికల్లో బైడెన్‌ గెలిచినట్లు నిర్ధారణ అయినా అధికార మార్పిడి చర్యలు తీసుకోవాల్సిన అమెరికా జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ మాత్రం మీన మేషాలు లెక్కిస్తోంది. జీఎస్‌ఏ జనరల్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎమిలీ మర్ఫీ 2017లో ట్రంప్ హయాంలో ఆ పదవిలో నియమించబడ్డారు. ఇప్పుడు ఈయన బైడెన్‌ను అధికారికంగా స్పష్టమైన విజేతగా ప్రకటించడంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఎప్పటిలోగా ఆయన అధ్యక్ష ఎన్నికల ఫలితంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారో కూడా చెప్పడం లేదు. దీంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జీఎస్‌ఏ జనరల్‌ అడ్మినిస్ట్రేటరే కీలకం...

జీఎస్‌ఏ జనరల్‌ అడ్మినిస్ట్రేటరే కీలకం...

బైడెన్-కమలా హ్యారిస్‌ విజయాలు ఖాయమైనా ట్రంప్‌ మొండిపట్టు నేపథ్యంలో జీఎస్‌ఏ జనరల్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎమిలీ మర్ఫీ నిర్ణయం కీలకంగా మారింది. మర్ఫీ తీసుకుంటే తప్ప కాబోయే అధ్యక్షుడుగా ఉన్న బైడెన్‌ కోట్లాది డాలర్ల నిధుల వినియోగంపై కానీ, నిఘా, ఇతర అధికారులతో సమావేశాలు అయ్యేందుకు కానీ వీల్లేదు. శనివారం నాటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత తేలిపోవడంతో స్ధానిక చట్టాల ప్రకారం కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ టీమ్‌కు అమెరికా వాణిజ్య విభాగం అధికారిక కార్యకలాపాలు నడిపే స్దలాన్ని కూడా కేటాయించింది. కానీ ఉద్యోగుల జీతాలు, కన్సల్టెంట్లు, పర్యటనల అవసరాలకు మాత్రం నిధులు వాడుకునే అవకాశం ఇవ్వలేదు. దీనిపై బైడెన్‌ శిబిరం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ అధికార మార్పిడి ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

English summary
US President-elect Joe Biden's campaign on Sunday urged the Trump political appointee who heads the U.S. General Services Administration to approve an official transition of power despite President Donald Trump's refusal to concede.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X