వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ సెనేట్ కమిటీ ముందుకు ట్రంప్ పెద్దకొడుకు, ట్రంప్ గెలుపులో రష్యా సహకారంపై ఏం చెప్పాడంటే...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం, డొనాల్డ్ ట్రంప్ గెలుపులో రష్యా సహకారంపై అమెరికాలో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏర్పాటైన కమిటీ ముందుకు బుధవారం ట్రంప్ పెద్ద కొడుకు ట్రంప్ జూనియర్ హాజరై వాంగ్మూలమిచ్చాడు.

ఉదయం 10 గంటల ప్రాంతంలో యూఎస్ సెనేట్ బిల్డింగ్‌లోకి ప్రవేశించిన ట్రంప్ జూనియర్ ఇంటెలిజన్స్ కమిటీ ఎదుట హాజరయ్యాడు. అతడి రాక మీడియా కంట పడకుండా అక్కడి అధికారులు శతవిధాలా ప్రయత్నించారు కానీ జర్నలిస్టుల కళ్లు కప్పలేకపోయారు.

ఈ సందర్భంగా ట్రంప్ జూనియర్‌ను ఇంటెలిజన్స్ కమిటీ సభ్యులు దాదాపు 9 గంటలపాటు ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. 2016 నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Trump’s eldest son testifies to US Senate committee in Russia probe

అయితే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేసిన ప్రచారంలో రష్యా ప్రమేయం ఉందని, పరోక్షంగా ఆయన గెలుపునకు ఆ దేశం సహాయం చేసిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణలను అటు రష్యా, ఇటు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లోనే ఖండించారు.

సెనేట్ కమిటీ విచారిస్తున్న పలు ప్రధాన అంశాలలో ట్రంప్ గెలుపులో రష్యా సహకారం కూడా ఒకటి. ట్రంప్ జూనియర్‌ను విచారించడానికి ఒక్కరోజు ముందు.. అంటే మంగళవారం సెనేట్ ఇంటెలిజన్స్ కమిటీ ఛైర్మన్ రిచర్డ్ బర్ మీడియాతో మాట్లాడారు.

ట్రంప్ ఎన్నికలో రష్యా పరోక్ష సహకారం అంశంపై తమ విచారణను వేగవంతం చేశామని, 2018 ఏడాది తొలి నెలల్లోనే దీనిపై ఒక నిర్ధారణకు రాగలుగుతామని చెప్పారు. ఈ కేసు విచారిస్తున్న వారిలో అమెరికా న్యాయశాఖకు చెందిన స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ ముల్లర్ కూడా ఉన్నారు.

గత వారం కూడా ట్రంప్ జూనియర్ వాంగ్మూలాన్ని సెనేట్ కమిటీ తీసుకుంది. 2016 జూన్ నెలలో రష్యాకు చెందిన ఓ న్యాయవాదితో ట్రంప్ జూనియర్ తమ ట్రంప్ టవర్‌లో సమావేశం అయ్యారు. వీరిద్దరి భేటీలో ఎక్కువగా ఏం మాట్లాడుకున్నారనే విషయంపైనే ఆరా తీసినట్లు సమాచారం.

English summary
US President Donald Trump’s eldest son met with the U.S. Senate Intelligence Committee on Wednesday as part of the panel’s investigation into Russia, the 2016 US election and whether his father’s election campaign colluded with Moscow. Donald Trump Jr. arrived at a Senate office building shortly after 10 a.m. Capitol police officers tried to keep journalists from witnessing his arrival, but he was spotted by reporters as he rushed to a room the committee uses for classified briefings. He testified for nine hours, a person familiar with the matter said. U.S. intelligence agencies said after Trump’s victory in the November 2016 presidential election that they had concluded Russia sought to influence the campaign to boost Trump’s chances of defeating former Secretary of State Hillary Clinton, his Democratic challenger. Moscow has denied any such activity, and Trump has dismissed talk of possible collusion as a “witch hunt” led by Democrats disappointed about his victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X