అధ్యక్షుడిగా రేపటికి వంద రోజులు.. మీడియాతో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపటితో తన వంద రోజుల పాలన పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో తన అనుభవాలను ట్రంప్ మీడియాతో పంచుకున్నారు.

'అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు ఒక వృద్ధుడిగా నా జీవితం చాలా బాగుంది. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అయితే, అధ్యక్షుడిని అయ్యాక, డ్రైవింగ్ చేయడాన్ని చాలా మిస్సవుతున్నాను .. నడపలేకపోతున్నాను..' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

trump

ఇంకా ఆయన ఏమన్నారంటే.. 'అధ్యక్షుడిని కాకముందు.. అన్ని పనులు నేనే చేసుకునే వాడిని. అయితే, అధ్యక్షుడిగా అంతకంటే ఎక్కువ పనులే ఉంటున్నాయి. ఆ జీవితం కంటే, అధ్యక్షుడిగా ఉండటమే సులువుగా అనిపిస్తోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎక్కడికీ పోలేము .. దీంతో, ఓ భద్రమైన గూటిలో ఉన్నట్టుంది' అని ట్రంప్ పేర్కొన్నారు.

దేశాధ్యక్షుడిగా తన వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న రోజున పెన్సిల్వేనియాలో పెద్ద ర్యాలీ చేపడతానని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. ఈ ర్యాలీ రేపు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Washington: On the occassion of first 100 days in president's office Donald Trump expressed his views on his admnistration. While talking to media he expressed his feelings.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి