H-1B visa: భారతీయ టెకీలకు నెక్ట్ ఆప్షన్ దేశాలివే-ఇవి చెక్ చేసుకోవాల్సిందే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తమ దేశంలోకి వచ్చే విదేశీ వృత్తినిపుణులకు ఇచ్చే హెచ్1బీ వీసా ఛార్జీల్ని భారీగా పెంచేశారు. అమెరికాలో కంపెనీలు స్వదేశంలో వారికి ఉద్యోగాలు కల్పించకుండా విదేశీ నిపుణుల్ని తీసుకోవడంపై గుర్రుగా ఉన్న ట్రంప్.. వాటిని నిరుత్సాహపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం హెచ్1బీ వీసా ఛార్జీల పెంపు భారానికి భయపడి అయినా విదేశీ నిపుణుల్ని వద్దనుకుంటారనేది ట్రంప్ ఆశ. అయితే అమెరికన్ కంపెనీలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
అదే సమయంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు యూరప్ దేశాలకు వరంగా మారుతోంది. ఇప్పటివరకూ హెచ్1బీ వీసా ఛార్జీలు తక్కువగా ఉండటం, సానుకూల వాతావరణం ఉండటంతో విదేశీ నిపుణుల్ని ఆకర్షించే విషయంలో యూరప్ దేశాలు అమెరికా కన్నా వెనుకబడ్డాయి. కానీ ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలన్న దానిపై యూరప్ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ టెకీల్ని అమెరికా నుంచి తమ దేశాలకు ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారతీయ టెకీలు ఇప్పుడు చాలా సులువుగా అమెరికాను వీడి యూరప్ దేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతోంది. అమెరికా ఆఫర్ చేస్తున్న జీతభత్యాలు, ఇతర పెర్క్ లు ఇచ్చి మరీ యూరప్ దేశాలు ఆహ్వానం పలుకుతుంటే భారతీయ టెకీలు ఎక్కడ వెళ్లిపోతారన్న ఆందోళన అమెరికన్ కంపెనీల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే జర్మనీ, యూకే వంటి యూరోపియన్ దేశాలు భారత్ వంటి దేశాల నుండి నిపుణుల్ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. సైన్స్, సాంకేతిక రంగాలలో ప్రతిభను ఆకర్షించడానికి చైనా కూడా కే-వీసాను ప్రవేశపెట్టింది.
అయితే ఇక్కడో సమస్య ఉంది. బ్రిటన్ సహా పలు యూరప్ దేశాల్లో తాజాగా వలసల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
అలాగే వివిధ యూరోపియన్ దేశాలలో వలస వ్యతిరేక భావన కూడా పెరుగుతోంది.మరోవైపు అగ్రశ్రేణి ప్రపంచ ప్రతిభావంతుల కోసం వీసా ఫీజులను రద్దు చేయడానికి లేదా తగ్గించడానికి బ్రిటన్ ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోని టాప్ ఐదు వర్సిటీల్లో చదివిన లేదా అవార్డులు సాధించిన దరఖాస్తుదారులకు వీసా ఫీజులను పూర్తిగా రద్దు చేయడం ఇందులో ఒకటి. దీంతో జూనియర్, మధ్య స్థాయి నిపుణులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

జర్మనీది కూడా ఇదే పరిస్ధితి. అక్కడా భారతీయ నిపుణులు స్థానికుల కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. దీంతో వలసలపై అక్కడి ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. జర్మనీ తాజా వీసా నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు కనీసం ఐదు సంవత్సరాలు స్థానికంగా నివసించాలి. అలాగే కెనడాలోనూ జనవరి - జూన్ మధ్య వర్క్ పర్మిట్ జారీలు 50 శాతం తగ్గాయి. అలాగే వీసాల తనిఖీలు కూడా పెంచారు. కాబట్టి ఆయా దేశాలు ఏ మేరకు మినహాయింపులు ఇస్తాయన్న దానిపై భారతీయుల అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.












Click it and Unblock the Notifications