నేను చెప్పిందే కరెక్ట్, ముస్లీంల వల్లే దాడులు.. నిరూపిస్తా: డొనాల్డ్ ట్రంప్
బెర్లిన్ దాడి పైన అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బెర్లిన్, అంకారాల్లో జరిగిన దాడులు మానవత్వం పైన జరిగిన దాడులు అన్నారు. వీటిని వెంటనే ఆపేయాలని ఆయన అన్నారు.
వాషింగ్టన్: బెర్లిన్ దాడి పైన అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బెర్లిన్, అంకారాల్లో జరిగిన దాడులు మానవత్వం పైన జరిగిన దాడులు అన్నారు. వీటిని వెంటనే ఆపేయాలని ఆయన అన్నారు.
అమెరికాకు వలస వస్తున్న ముస్లింల పైన నిషేధం విధించాలన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. అదే సరైనదని వ్యాఖ్యానించారు. ముస్లింల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయనే దానిని తాను నిరూపిస్తానని చెప్పారు. తాను చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవం అన్నారు.

బెర్లిన్‌లోని క్రిస్మస్ మార్కెట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో పన్నెండు మంది చనిపోయారు. ఈ దాడి తమదేనంటూ ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఆ తర్వాత టర్కీ రాజధాని అంకారాలో ఓ ఆర్ట్ గ్యాలరీని తిలకించేందుకు వచ్చిన రష్యా రాయబారిపై కాల్పులు జరిపి చంపేశారు.
ఈ నేపథ్యంలో ట్రంప్‌ను స్పందించారు. అంతకుముందు సోమవారం ట్రంప్ స్పందిస్తూ.. ఐసిస్, ఇతర ఇస్లామిక్ తీవ్రవాదులు వరసగా క్రైస్తవ సమాజాన్ని, చర్చిలను లక్ష్యంగా చేసుకుని ఊచకోతకు పాల్పడుతున్నారన్నారు. ఈ ప్రకటన పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన పదాలను మార్చుకున్నారు. అది మానవత్వం పైన దాడి అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications