వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక లాంఛనమే: ఎలెక్టొరల్‌ కాలేజీలో ట్రంప్ ఘనవిజయం

దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్.. ఎలక్టోరల్ కాలేజీలో ఘన విజయం సాధించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్.. ఎలక్టోరల్ కాలేజీలో ఘన విజయం సాధించారు. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. ట్రంపే అమెరికా అధ్యక్షుడంటూ ఎలెక్టొరల్‌ కాలేజీ మంగళవారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

అధ్యక్ష ఎన్నికకు అవసరమైన 270 కన్నా ఎక్కువ ఓట్లే.. ట్రంప్‌కు ఎలెక్టొరల్‌ కాలేజీలో వచ్చాయి. ట్రంప్‌ను వైట్‌హౌస్‌లోకి అడుగపెట్టనీయకుండా అడ్డుకోవడానికి రిపబ్లికన్‌ పార్టీలోని ఆయన బద్ధ శత్రువులు చేసిన చివరి ప్రయత్నాలూ సఫలం కాలేదు. నవంబరు 8వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Trump wins electoral college amid nationwide protests

ట్రంప్‌నకు 304 ఎలెక్టొరల్‌ ఓట్లు, హిల్లరీకి 227 ఓట్లు వచ్చాయి. జనవరి 20వ తేదీన బరాక్‌ ఒబామా స్థానంలో ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో జరిగిన ఎలెక్టొరల్‌ కాలేజీ ఓట్లను సాంకేతికంగా 2017 జనవరి ఆరోతేదీన అమెరికా కొత్త కాంగ్రెస్‌ లెక్కిస్తుంది.

కాగా, ఓట్ల మొత్తమెంతో ఇప్పటికే బహిర్గతమయింది. కాబట్టి ట్రంప్‌ ఎన్నికైనట్లే. నవంబరు 8 నాటి అసలు ఎన్నికల్లో విజయం సాధించాక... ఇక ఎలెక్టొరల్‌ కాలేజీ ఓట్లకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అయితే కొందరు రిపబ్లికన్లు ట్రంప్‌ ఎన్నికను వ్యతిరేకించడంతో.. ఈ ఎన్నికపైనా ఆసక్తి పెరిగింది.

ఎలక్టోరల్ కాలేజీ విజయవం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. 'ఎలెక్టొరల్‌ కాలేజీలో నా ఘనవిజయం చరిత్రాత్మకమైంది. నా పట్ల అమెరికా ప్రజలు కనబరచిన సంపూర్ణ విశ్వాసానికి కృతజ్ఞతలు. మీడియా ఎన్ని వక్రభాష్యాలు చెప్పినప్పటికీ.. వారు ఊహించిన దానికన్నా భిన్నంగా.. గెలుపునకు అవసరమైన 270 ఓట్ల కన్నా చాలా ఎక్కువ ఓట్లు నాకొచ్చాయి. దేశంలోని లక్షలమంది శ్రమ ఫలితం ఈ విజయం' అని ఆయన చెప్పుకొచ్చారు.

English summary
The US electoral college has certified Donald Trump as the 45th president, despite a last-ditch effort to deny him the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X