"గీత దాటితే.. ఏరి పారేస్తాం".. ట్రంప్ ఫైనల్ వార్నింగ్
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వేగంగా.. వీరోచితంగా.. దారుణంగా దెబ్బకొడతామని స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు మద్దతు ఇచ్చే అనేక దేశాలు హమాస్ పై మిలిటరీ చర్యకు ఆమోదం తెలిపాయని.. హమాస్ తోక జాడిస్తే ఏరి పారేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ , మిడిల్ ఈస్ట్ దేశాల అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్ కాఫ్ లు శాంతి ఒప్పందంపై సమావేశం జరిపేందుకు ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హమాస్ అంతం వేగంగా.. వీరోచితంగా.. దారుణంగా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గీత దాటితే .. హమాస్ ను అంతం చేసేందుకు మిడిల్ ఈస్ట్ లోని అమెరికా భాగస్వామ్య దేశాలు మిలిటరీ యాక్షన్ కు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. హమాస్ ను అంతం చేస్తామన్నారు. హమాస్ బాధ్యతతో నడుచుకోవాలని సూచనలు చేశారు.
" మిడిల్ ఈస్ట్ లోని అనేక దేశాలు, మిడిల్ ఈస్ట్ సరిహద్దు దేశాలు చాలా ఉత్సాహంతో ఉన్నాయి. గాజా వెళ్లి హమాస్ అంతం చేసేందుకు మిలిటరీ యాక్షన్ కు సిద్ధం అని పేర్కొన్నాయి. గాజాలో భారీ స్థాయిలో దళాలను మోహరించేందుకు ఆ దేశాలు రెడీగా ఉన్నాయి. హమాస్ ఇలానే చెడుగా వ్యవహరిస్తే, కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే అంతం తప్పదు. మిడిల్ ఈస్ట్ లోని అన్ని దేశాలు ఇలా హమాస్ పై ఏకతాటిపైకి రావడం గత వెయ్యేళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఈ అద్భుతమైన పరిణామాన్ని అలాగే ఉంచాలి" అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మాధ్యమంలో రాసుకొచ్చారు.

అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ , మిడిల్ ఈస్ట్ దేశాల అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్ కాఫ్ లు శాంతి ఒప్పందంపై సమావేశం జరిపేందుకు ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మేరకు తమకు సహకరించిన ఇండోనేషియాకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇటీవల ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే తమ వల్లే తొలిసారి పశ్చిమాసియాలో శాంతి నెలకుందని.. అలాగే హమాస్ తో ఇజ్రాయెల్ కు ఒప్పందం కుదిర్చామని ట్రంప్ చెప్పుకుంటూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications