హోటళ్లు, బీచ్‌లపై తుపాకీ గుళ్ల వర్షం: 27మంది మృతి
ట్యూనిస్: ట్యూనీషియాలోనూ ఉగ్రవాదులు తెగబడ్డారు. రెండు పర్యాటక హోటళ్లతోపాటు, సమీపంలోని బీచ్‌లో తుపాకులతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 27 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. మృతుల్లో విదేశీయులు సైతం ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనతో బీచ్‌లో సేదతీరుతున్న వారు, హోటళ్లలో ఉన్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు.

పరిసర ప్రాంతాలకు చెందిన వారు కూడా పేలుడు శబ్ధాలు విని ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగిందనే విషయం ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని స్థానిక మీడియా పేర్కొంది. మృతి చెందిన వారిలో యూరప్, ఉత్తర ఆఫ్రికా దేశస్తులే ఎక్కువగా ఉన్నారని తెలిసింది.
భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని కాల్చిచంపాయి. కాగా, ఓ ఉగ్రవాది బీచ్‌లో కాల్పులకు పాల్పడంతో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ట్యూనీషియా అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. మార్చి నెలలో ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు ట్యూనీషియాలోని బార్డో మ్యూజియంపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications