వైరల్ వీడియో: ఘోర విమాన ప్రమాదం.. 20 మంది మృతి
అజర్ బైజాన్- జార్జియా సరిహద్దులో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టర్కీకి చెందిన మిలిటరీ కార్గో విమానం కుప్పకూలిన ఘటనలో 20 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. టర్కీకు చెందిన మిలిటరీ కార్గో విమానం సీ-130 అజర్ బైజాన్ నుంచి బయల్దేరి టర్కీకి చేరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అజర్ బైజాన్ లోని మీడియా కథనాల ప్రకారం.. కుప్పకూలడానికి ముందు సైనిక విమానం గాల్లోనే గింగిరాలు తిరిగినట్లు తెలుస్తోంది. విమానం రెండు వైపుల నుంచి దట్టమైన పొగలు చిమ్ముతూ కొండల మధ్య పడినట్లు స్పష్టం అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల రష్యాకు చెందిన సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ అకస్మాత్తుగా ఒకేసారి నేలను ఢీకొట్టడంతో తోక భాగం ముక్కలైంది. దీంతో ప్రమాదం సంభవించింది. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే టర్కీ సైనిక విమానం కుప్పకూలిన ఘటనపై ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రెస్ వాళ్లు ఘటనకు సంబంధించిన ఫోటోలను విడుదల చేయొద్దని కోరింది. విమాన ప్రమాదం ఘటనపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులను వీరులుగా అభివర్ణించారు. అలాగే అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్ హమ్ అలియేవ్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అజర్ బైజాన్ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్.. జార్జియా దేశ ఉన్నతాధికారులతో మాట్లాడారు. పరిస్థితిపై ఆరా తీశారు.
🇹🇷| Turkish military cargo plane C130 crashed near the Georgian-Azerbaijan border. pic.twitter.com/iWV8UYHm5L
— Eternal Glory (@EternalGlory0) November 11, 2025
సీ-130 విమానం అజెర్ బైజాన్ నుంచి టర్కీకి ప్రయాణిస్తుండగా సిగ్ నాగీ రీజియన్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో జార్జియా- అజర్ బైజాన్ సరిహద్దులో ఈ ఘటన జరిగినట్లు స్పష్టం అవుతోంది. సీ-130 హెర్కూల్స్.. మిలిటరీ కార్గో విమానం.. అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసింది.












Click it and Unblock the Notifications