ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లో ఆత్మాహుతి దాడి: 26 మంది మృతి
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కారు బాంబు దాడిలో దాదాపు 26 మంది మృతి చెందారు. పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి అతి సమీపంలోని అర్ఫా కరీమ్ టవర్ వద్ద ఈ దాడి జరిగింది.
లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కారు బాంబు దాడిలో దాదాపు 26 మంది మృతి చెందారు. పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి అతి సమీపంలోని అర్ఫా కరీమ్ టవర్ వద్ద ఈ దాడి జరిగింది.

మరో 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో సమావేశంలో ఉండగా ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి దాడి అని లాహోర్ పోలీసు చీఫ్ అమిన్ వెయిన్స్ ధ్రువీకరించారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications