వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా అయితేనే ముందుకు, పరాగ్ అగర్వాల్‌ను ట్రోల్ చేస్తూ..: ట్విట్టర్ డీల్‌పై ఎలాన్ మస్క్ ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ వ్వవస్థాపకుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుపై మరోసారి ట్విస్ట్ ఇచ్చారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో స్పామ్ అకౌంట్స్ 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయని రుజువు చేస్తేనే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందంపై ముందుకు వెళ్తామని ఎలాన్ మస్క్ తేల్చి చెప్పారు.

ట్విట్టర్ డీల్ $44 బిలియన్లు చాలా ఎక్కువ: ఎలాన్ మస్క్

ట్విట్టర్‌లో కొనసాగుతన్న స్పామ్ అకౌంట్లపై పూర్తి స్పష్టత వచ్చాకే ఒప్పందంపై ముందుకు వెళ్తామని ఈ బిలియనీర్ పునరుద్ఘాటించారు. అంతేగాక, ఫేక్ ఎకౌంట్స్ సాకు చూపి ట్విట్టర్ డీల్ $44 బిలియన్లు చాలా ఎక్కువ అని ఎలాన్ మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే, ఇంతకంటే తక్కువకే ట్విట్టర్‌ను పొందాల్సి ఉంటుందన్నారు.

ఫేక్ అకౌంట్ 5 శాతం కంటే తక్కువ ఉంటేనే డీల్ ముందుకు: ఎలాన్ మస్క్

'20% నకిలీ/స్పామ్ ఖాతాలు, అంటే ట్విట్టర్ చెబుతున్న దాని కంటే 4 రెట్లు ఎక్కువ *అధికంగా* ఉండవచ్చు. నా ఆఫర్ Twitter.. SEC ఫైలింగ్‌లు ఖచ్చితమైనవిగా ఉండటంపై ఆధారపడింది. నిన్న, Twitter CEO <5% రుజువును చూపించడానికి బహిరంగంగా నిరాకరించారు. అతను దీనిపై రుజువు చేసే వరకు ఈ ఒప్పందం ముందుకు సాగదు' అని మస్క్ ట్వీట్ ప్రతిస్పందనలో తెలిపారు.

ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను ట్రోల్ చేసిన ఎలాన్ మస్క్

బాట్, స్పామ్ లేదా నకిలీ ఖాతాలతో పోరాడటానికి మైక్రోబ్లాగింగ్ సైట్ ప్రయత్నాలను వివరిస్తూ వరుస ట్వీట్లను పోస్ట్ చేసిన ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్‌ను మస్క్ ట్రోల్ చేశారు. సోమవారం వరుస ట్వీట్లలో, మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ డేటా, వాస్తవాలు, సందర్భంతో స్పామ్, నకిలీ ఖాతాలపై ఎలా పోరాడుతుందో అగర్వాల్ వివరించారు.

పరాగ్ అగర్వాల్ సుదీర్ఘ వివరణ ఇచ్చినా సంతృప్తి చెందని ఎలాన్ మస్క్

అయితే, పరాగ్ అగర్వాల్ వివరణలతో ఎలాన్ మస్క్ సంతృప్తి చెందలేదు. తనకు నమ్మకంగా అనిపించలేదంటూ పూప్ ఎమోజితో థ్రెడ్‌కు ప్రతిస్పందించారు. "అయితే ప్రకటనదారులు తమ డబ్బు కోసం ఏమి పొందుతున్నారో ఎలా తెలుసుకుంటారు? ఇది ట్విట్టర్ ఆర్థిక ఆరోగ్యానికి ప్రాధాన్యమైనది." అని ఎలాన్ మస్క్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Twitter వారి వాదనలు నిజమైతే బాహ్య ధ్రువీకరణను స్వాగతించాలని అనిపిస్తుందని వేరొక ట్వీట్ చేశారు.

English summary
twist in Twitter Deal: Elon Musk Wants A 'Proof' From Twitter CEO On Fake Accounts Claim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X