షాక్: ఐరాసలో ఇండియా ప్రతినిధి అక్బర్ ట్విట్టర్ అకౌంట్ హ్యక్ చేసిన పాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అకౌంట్‌ను పాక్‌ ఉగ్రసంస్థలు హ్యాక్‌ చేశాయి. సయ్యద్‌ ట్విటర్‌లో పాక్‌ జెండాను, దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఫోటోను పోస్టు చేశాయి.దీంతో కలకం రేగుతోంది.

ఆదివారం ఉదయం సయ్యద్‌ ట్విటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు రెండు పాకిస్థాన్‌ జెండా ఫోటోలను ఉంచారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అధికారిక ట్విటర్‌కు ఉండాల్సిన బ్లూ టిక్‌ మార్క్‌ కూడా కనిపించలేదు. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు.

Twitter Account of India's Top Ambassador to UN Hacked

పోస్టులను తొలగించి అకౌంట్‌ను ట్వీటర్‌ పునరుద్ధరించారు. పాక్‌కు చెందిన హ్యాకర్లే ఈ పనికి పాల్పడినట్లు అధికారులు దృవీకరించారు. భారత అధికారిక సైట్లను పాక్‌ ఉగ్రసంస్థలు పలు దఫాలు హ్యాక్‌ చేశాయి.

2013-2016 మధ్య 700 సైట్లను పాక్ ఉగ్రవాదులు హ్యాక్‌ చేశాయి. ఇందులో 199 ప్రభుత్వ వెబ్‌ సైట్లు ఉన్నాయి. గతేడాది జనవరిలో జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ)ని హ్యాక్‌కి గురి కావటం పెను కలకలమే రేపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's Permanent Representative to the United Nations Syed Akbaruddin's Twitter account was hacked and later restored on Sunday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి