వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ సీఈఓ డోర్సేకు ల్యాప్‌ట్యాప్ లేదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విట్టర్ సీఈఓగా పనిచేస్తున్న జాక్‌డోర్సే వద్ద స్వంత ల్యాప్‌టాప్ లేదు. ఆయన ల్యాప్‌టాప్‌ను వాడరని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన మొబైల్ ద్వారానే ఆయన అన్ని పనులు చేసుకొంటారని ఆయన వెల్లడించారు.

ట్విట్టర్ సీఈఘఓ జాక్ డోర్సే తన మొబైల్ ఫోన్‌నే ల్యాప్ టాప్ మాదిరిగా ఉపయోగిస్తారు. అందుకే ఆయన వద్ద స్వంతంగా ల్యాప్ టాప్ లేదని ఆయన స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో డోర్సే ఈ విషయాన్ని వెల్లడించారు.

Twitter CEO Jack Dorsey doesnt own a laptop!

తాను ల్యాప్‌టాప్‌ వాడననని, ప్రతీది తన ఫోన్‌ ద్వారానే నిర్వహిస్తానని చెప్పారు. తన సొంత ఆన్‌లైన్‌ సెక్యురిటీ ప్రాక్టిస్‌ విషయాలపై మాట్లాడుతున్న సమయంలో డోర్సే ఈ విషయాన్ని వెల్లడించారు.

నోటిఫికేషన్లన్నింటినీ ఆపివేసి ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేస్తానని, తన ముందున్న దానిపైనే దృష్టిపెట్టడం తనకు అలవాటని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌పై అన్ని ఒకేసారి చేయడం కంటే ఇదే బెస్ట్‌ అని చెప్పారు.

ల్యాప్‌టాప్‌లాగా ఫోన్‌ను వాడటానికి పలు వాయిస్‌ టైపింగ్‌ టూల్స్‌ ఉన్నాయన్నారు. కేవలం మైక్రోబ్లాగింగ్‌ కంపెనీని నిర్వహించడమే కాకుండా తన డిజిటల్‌ జీవితాన్ని నిజ జీవితాన్ని తగిన విధంగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు డోర్సే.

ప్రైవసీ, సెక్యురిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించాలని, మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి మీ వద్ద ఉన్న కంపెనీ డేటాకు రక్షణ కలిగించడానికి అవసరమైన టూల్స్‌ గురించి తెలుసుకుని ఉండాలని చెప్పారు. 2015లో జాక్‌ డోర్సే రెండోసారి ట్విటర్‌ సీఈవోగా ఎంపికయ్యారు.

English summary
When people run some of the biggest tech companies in the world, it is assumed they have accessed to some of the finest gadgets available and obviously, use them too. However, Twitter CEO Jack Dorsey is an exception.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X