వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కోర్టు వివాదం గురించి దాచింది: ట్విట్టర్‌పై ఎలాన్ మస్క్ దావా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ట్విట్టర్‌ డీల్‌పై స్పందించారు. ట్వట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఎలాన్ మస్క్.. తాజాగా ఆ సంస్థతో కోర్టు వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. తమ వేదికపై నకిలీ ఖాతాల వివరాలు ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమవడంతోనే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో విషయం వెల్లడించారు.

భారత ప్రభుత్వంపై ట్విట్టర్ వేసిన ప్రమాదకర వ్యాజ్యాన్ని ఆ సంస్థ ఒప్పందంలో బయటపెట్టలేదని ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఈ మేరకు తన కౌంటర్ దావాలో పేర్కొన్నారు. కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఎలాన్ మస్క్ పై ట్విట్టర్ డెలావర్ కోర్టులో దావా వేసింది. ఈ క్రమంలో దీనిపై ఇటీవల మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు. ఆ పిటిషన్లో వివరాలు తాజాగా బయటికొచ్చాయి.

twitter failed disclose legal fight with indian government: elon musk

తనను మభ్యపెట్టి, మోసం చేసి ట్విట్టర్ ను కొనుగోలు చేసేలా ఒప్పందంపై సంతకం పెట్టించారని మస్క్ ఆరోపించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంతో ట్విట్టర్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన వివాదాన్ని కూడా మస్క్ తన కౌంటర్ దావాలో ప్రస్తావించారు.

కాగా, భారత ప్రభుత్వం విధించిన చట్టాలను పాటించకుండా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ కోర్టుకు వెళ్లింది. దీంతో తన మూడో అతిపెద్ద మార్కెట్ ను ప్రమాదంలో పడేసింది. ఈ వ్యాజ్యం గురించి ట్విట్టర్ ఒప్పందంలో వెల్లడించలేదని దావాలో మస్క్ పేర్కొన్నారు. అయితే, మస్క్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ట్విట్టర్.

English summary
twitter failed disclose legal fight with indian govt: elon musk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X