టెర్రిఫైయింగ్ విజువల్స్- గాల్లో ఉండగా హెలికాప్టర్లు ఢీ: చెన్నై వాసి మృతి

నేపాల్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో భారత పర్యాటకుడొకరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద సంభవించిన దుర్ఘటన ఇది. దీంతో పర్వతారోహణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

నేపాల్ లోని ప్రసిద్ధ సోలుకుంబు జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ సందర్భంగా పర్యాటకులను తరలిస్తోన్న రెండు హెలికాప్టర్లు ఈ ఉదయం 8:11 నిమిషాల సమయంలో ఒకే హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో చెన్నైకి చెందిన వసంత్ కుమార్ బలరామరామడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని నేపాల్ అధికారులు ధృవీకరించారు.

Two Helicopters Collide Near Everest Base Camp Solukhumbu in Nepal One Tamil Nadu tourist Killed

సోలుకుంబు జిల్లాలోని ఖుంబు పాసాంగ్ లహాము రూరల్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. హిమగిరుల మధ్య సముద్ర మట్టానికి సుమారు 13,780 అడుగులు ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ఫిష్‌టైల్ ఎయిర్, ఎయిర్ డైనాస్టీ సంస్థలకు చెందిన హెలికాప్టర్లు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో అందుబాటులో ఉంటోన్నాయి. ప్రమాద సమయంలో వసంత్ కుమార్ ఫిష్‌టైల్ ఎయిర్ హెలికాప్టర్ లో ఉన్నారు. అదే హెలికాప్టర్ లో ఉన్న న్యూజిలాండ్ పౌరుడు, భారత సంతతికి చెందిన శైలేష్ కృష్ణ పటేల్ తీవ్రంగా గాయపడ్డారు.

అంబటి రాంబాబుకు ఈడీ సమన్లు- రేపే విచారణకు
అంబటి రాంబాబుకు ఈడీ సమన్లు- రేపే విచారణకు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. వసంత్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, లుక్లా ఆసుపత్రికి తరలించారు. శైలేష్ కృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రమాదానికి గురైన రెండు హెలికాప్టర్ల పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

పసిడి ధరల్లో పాజిటివ్ ట్రెండ్- రెండో రోజూ
పసిడి ధరల్లో పాజిటివ్ ట్రెండ్- రెండో రోజూ

ఫిష్‌టైల్ ఎయిర్ హెలికాప్టర్ పైలట్ ప్రజ్వల్ కేసీ, ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ పైలట్ రవీంద్ర ప్రజాపతిలకు స్వల్ప గాయాలయ్యాయని నేపాల్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం నేపాల్‌లో ఎవరెస్ట్ ట్రెక్కింగ్ సీజన్ ఉధృతంగా సాగుతోంది. భారత్ తో పాటు ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పర్వతారోహకులు, పర్యాటకులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను సందర్శించడానికి హిమాలయ ప్రాంతాలకు చేరుకుంటోన్నారు.

సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తులో ఉండే ఫెరిచే వంటి ప్రాంతాలకు ట్రెక్కర్లు, అవసరమైన ఇతర రవాణా సామాగ్రిని చేరవేయడానికి హెలికాప్టర్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. హిమాలయ పర్వత ప్రాంతాలలో వాతావరణం క్షణక్షణానికి మారుతుండటం, విజిబిలిటీ తగ్గడం, అధిక గాలులు వీయడం వంటి సవాళ్లు తీవ్ర ఆటంకం కలిగిస్తాయి. అలాగే 4,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న ఫెరిచే వద్ద గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, హెలిప్యాడ్ వద్ద పరిమిత స్థలం ఉండటం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమౌతుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+