బ్రిటన్ ప్రధాని థెరిసా మే హత్యకు కుట్ర, ఇంటి గేట్లు పేల్చి చంపేయాలని ప్లాన్!

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రధాని థెరిసా మే హత్యకు గురి కాకుండా లండన్ భద్రతాదళాలు ఆమెను ప్రాణాలతో రక్షించారు. ఉత్తర లండన్ కు చెందిన నాయిముర్ జకారియా రెహ్మన్ (20), బర్మింగ్ హోమ్ కు చెందిన మహమ్మద్ అకీబ్ ఇమ్రాన్ (21) అనే ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

బ్రిటన్‌లో భారీ ఉగ్రవాద కుట్రను అక్కడి భద్రతాదళాలు చాకచక్యంగా భగ్నం చేశాయి. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేను హత్య చెయ్యడానికి స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నించారు. లండన్ ప్రధాని థెరిసా మే అధికార నివాసం అయిన డౌనింగ్‌ స్ట్రీట్‌ గేట్లు ఐఈడీ పేలుడుపదార్థాలతో పేల్చేయడానికి ప్రయత్నించారు.

Two men arrested for plotting to blow up Dowing street gates and kill British PM Theresa may

ఆ సందర్భంగా జరిగే గందరగోళం మధ్యలో లండన్ ప్రధాని థెరిసా మేను అంతం చెయ్యాలని ప్లాన్ వేశారు. ఆ సందర్బంలో ఉగ్రవాదులను చాకచక్యంగా అడ్డుకున్న స్థానిక భద్రతాళాలు ఇద్దరిని ప్రాణాలతో పట్టుకుని అరెస్టు చేశారని స్కై న్యూస్ వెల్లడించింది.

ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. డౌనింగ్‌ స్ట్రీట్‌ గేట్ల దగ్గర ఐఈడీ పేలుడు పదార్థాలు పేల్చి లండన్ ప్రధాని థెరిసా మేను హత్య చెయ్యాలని ఇద్దరు ఉగ్రవాదులు ప్లాన్ వేశారని స్థానిక పోలీసులు చెప్పారని స్కై న్యూస్ తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Metropolitan Police said on Tuesday that two men arrested last week had been charged with terrorism offenses and would appear in Westminster Magistrates' Court on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి