viral video:వామ్మో.. సముద్రంలో సుడి, బోట్ నుంచి పడిన ఇద్దరు,, అయినా సేఫ్

సముద్రంలో ప్రయాణం అంటేనే కాస్త భయం.. ఎంత పెద్ద ఓడ అయినా సరే బెణుకు ఉంటుంది. టైటానికి లాంటి షిప్ మునిగిపోయిన సంగతి తెలిసిందే. కానీ కొందరు మాత్రం సముద్రంలో షికారుకు వెళతారు. అలా కొందరు ప్రమాదంలో కూడా చిక్కుకుంటారు. సముద్రంలో సుడులు ప్రమాదకరం.. నదీ లాంటి చోటనే కష్టం.. ఇక సముద్రం గురించి చెప్పక్కర్లేదు. అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది.

మసాచుసెట్స్ తీరంలో ఇద్దరిని కాపాడారు. మోటర్ బోట్ సర్కిల్ ఆఫ్ డెత్ సమీపంలోకి వచ్చిందని.. ఆ క్రమంలో వారిని కాపాడామని నేవీ అధికారి తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు వారిని గుర్తించారని చెప్పారు. సర్కిల్ ఆఫ్ డెత్ వద్దకు నౌక రావడాన్ని గమనించామని.. వారిలో ఒకరు తెల్లని టీ షర్ట్ వేసుకున్నారని, చేయి ఊపడంతో రక్షించామని పేర్కొన్నారు.

 two People Rescued From Sea After Being Thrown From Boat

అయితే ఇద్దరు ఓడ నుంచి పడిపోయారని వివరించారు. సమయానికి వారి లైఫ్ జాకెట్టు కూడా ధరించలేదట. వెసెల్ కిల్ స్విచ్ కనెక్ట్ కాలేదని తెలిపారు. అయినప్పటికీ వారి వద్దకెళ్లి కాపాడగలిగామని చెప్పారు. వారికి గాయాలు కూడా కాలేదని అధికారులు తెలిపారు. సముద్రంలో అప్పుడప్పుడు సుడులు రావడం సహజం.. భారీ నౌక అయితే కుదుపునకు గురవుతుంది. కానీ చిన్న చిన్న ఓడలు అయితే ప్రమాదానికి గురికాక తప్పదు. ఎందుకంటే ఆ సుడులు సముద్ర గర్భం వరకు వెల్లే ఛాన్స్ ఉంటుంది. అంతే వేగంగా వెళ్లడంతో.. పడిపోయిన వారి పరిస్థితిని ఊహించలేం. కానీ వీరిద్దరికీ మాత్రం భూమి మీద నూకలు ఉన్నాయి. అందుకే ప్రమాదం బయటపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+