కొత్త వివాదం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేమే, మా గుర్తింపు దానికే: ట్రంప్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఏళ్ల తరబడి ఇజ్రాయిల్‌తో ఉన్న వివాదం సరిపోదన్న చందంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త వివాదానికి తెరతీశారు. ఇజ్రాయెల్‌పై ఆయన చేసిన తాజా ప్రకటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.

ఇజ్రాయిల్‌కు రాజధాని టెల్ అవీవ్ కాదని, ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న జెరూసలేం మాత్రమే ఆ దేశ రాజధానని స్పష్టం చేసిన ఆయన, మరో ఆరు నెలల్లో అమెరికా ఎంబసీని సైతం జెరూసలేంకు తరలిస్తామని వెల్లడించారు.

 U.S. to Recognize Jerusalem as Israel’s Capital, Trump Says, Alarming Middle East Leaders

అరబ్ నేతలతో సమావేశమైన ఆయన, తన మనసులోని నిర్ణయాన్ని తెలుపుతూ, టెల్ అవీవ్ నుంచి ఎంబసీని తరలించే పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించనున్నట్టు తెలిపారు.

పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి, సౌదీ రాజు సల్మాన్ తదితరులతో మాట్లాడిన తరువాత ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

ప్రపంచంలో మూడు మతాలకు అత్యంత పవిత్రమైన నగరంగా ఉన్న జెరూసలేంను ముస్లింలు, యూదులు, క్రైస్తవులు లక్షలాది సంఖ్యలో సందర్శిస్తుంటారన్న విషయం తెలిసిందే.

జెరూసలేంను మాత్రమే రాజధానిగా గుర్తించాలన్నది తమ దీర్ఘకాల ఆలోచనని, పాలస్తీనా వాసులతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించగానే ఎక్కడ శాంతికి విఘాతం కలుగుతుంతో అనే భయంతో పలు దేశాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.

అయితే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి పూర్తి మద్దతు పలుకుతున్నారు. టెల్ అవీవ్‌లోని ఎంబసీని తరలించే విషయమై నేడు ట్రంప్ మీడియాతో మాట్లాడతారని వైట్‌హౌస్ ప్రతినిధి సారా శాండర్స్ పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Trump plans to recognize Jerusalem as the capital of Israel and move the American Embassy there, upending nearly seven decades of American foreign policy and potentially destroying his efforts to broker peace between Israel and the Palestinians.Mr. Trump’s decision, a high-risk foray into the thicket of the Middle East, was driven not by diplomatic calculations but by a campaign promise. He appealed to evangelicals and ardently pro-Israel American Jews in 2016 by vowing to move the embassy, and advisers said on Tuesday he was determined to make good on his word.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X