భారత్ పై ట్రంప్ పిడుగు .. అమెరికాలోకి వచ్చే భారత ఉత్పత్తులపై 500 శాతం టారిఫ్.. ?
భారత్, చైనాలపై భారీ స్థాయిలో టారిఫ్ లు విధించే యోచనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం గత ఐదు రోజులుగా భారత వాణిజ్య ప్రతినిధులు అమెరికాలోని వాషింగ్టన్ లో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్.. ఓ కొత్త వాణిజ్య బిల్లును అమెరికా సెనెట్ లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు చట్టంగా మారితే భారత్, చైనాలపై 500శాతం టారిఫ్ లు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రష్యాతో వాణిజ్య సంబంధాలు కుదుర్చుకున్న దేశాలకు ట్రంప్ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ , చైనా దేశాలకు టారిఫ్ లను 500 శాతం పెంచేందుకు ప్రత్యేక చట్టాన్ని ట్రంప్ సర్కార్ తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం ద్వారా రష్యా ను ఒంటరి చేసి ఉక్రెయిన్ తో చర్చలు జరిపేందుకు సహకరించేలా చేసి.. చివరకి రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపేశానన్న కీర్తిని తాను మూటగట్టుకోవాలని ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
However Republicans are divided over tariffs
— Dr Nilima Srivastava (@gypsy_nilima) July 1, 2025
US Senator: "India and China will face a 500% tariff from America for supporting Russia."
"They buy 70% of Putin’s oil and are funding Russia’s war machine." pic.twitter.com/4D402kzVpg
ఈ మేరకు రష్యాను ఒంటరి చేయడమే లక్ష్యంగా ట్రంప్ ఈ టారిఫ్ బిల్లును సెనెట్ లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ విధానం వల్ల భారత్, చైనాలతో అమెరికా జరుపుతున్న వాణిజ్య ఒప్పందాలు దెబ్బతింటాయని అమెరికా కొంత వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ట్రంప్ దూకుడుగా వ్యవహరించి ఈ బిల్లును సెనెట్ లో ప్రవేశపెడతారా..? లేదా..? అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రస్తుతం భారత్, చైనాలు 70 శాతం చమురును రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి.
ఇదే విషయంపై రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్ సే గ్రహమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. " మీరు రష్యా నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఉక్రెయిన్ కు మాత్రం సాయం చేయడం లేదు. ఈ క్రమంలో అమెరికాలోకి వచ్చే ఉత్పత్తులపై 500 శాతం టారిఫ్ లు విధిస్తాం. ప్రస్తుతం భారత్, చైనాలు 70 శాతం చమురును రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి" అని సెనేటర్ లిండ్ సే గ్రహమ్ స్పష్టం చేశారు.

మరోవైపు జూన్ 26 నుంచి అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా భారత్- అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేకులు పడ్డట్లు కనిపిస్తోంది. జులై 9 లోపు వాణిజ్య ఒప్పందం పూర్తి చేసుకోవాలని ఇరు దేశాలు భావించినా అమెరికా కొత్త మెలికతో వాజిజ్య ఒప్పందాలకు డెడ్ లాక్ పడినట్లు సమాచారం అందుతోంది. వ్యవసాయం, డెయిరీ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ట్రేడ్ ఒప్పందానికి బ్రేకులు పడ్డట్లు తెలుస్తోంది. అగ్రికల్చర్, పాల ఉత్పత్తులపై భారత్ వెనక్కు తగ్గేలేదని తేల్చి చెప్పడంతో ఇరు దేశాలు వాణిజ్య డీల్ కు బ్రేకులు పడ్డట్లు సమాచారం.












Click it and Unblock the Notifications