ఇరాన్ వార్ లోకి రెండు గల్ఫ్ దేశాలు? ట్రంప్ వైఫల్యం వేళ బిగ్ ట్విస్ట్..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ప్రారంభించిన యుద్ధం రెండో నెలకు చేరుతుంది. అయినా ఇప్పట్లో యుద్దం ఆగే పరిస్ధితులు కనిపించడం లేదు. రెండు, మూడు వారాల్లో యుద్దం ముగిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలకు విలువ లేకుండా పోతోంది. మరోవైపు హార్ముజ్ జలసంధిని తెరిపించడంలో విఫలమైన అమెరికా ఇప్పుడు దాంతో సంబంధం లేకుండానే యుద్దం ముగించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇలాంటి సమయంలో హార్ముజ్ (hormuz) జలసంధిని తెరిపించేందుకు రెండు గల్ఫ్ దేశాలు సిద్ధమవుతున్నాయి.

హార్ముజ్ జలసంధి మీదుగా తమ చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలు పునరాలోచనలో పడుతున్నాయి. ఇన్నాళ్లు అమెరికా మిత్రులుగా ఉంటూ తమ దేశాల్లో బేస్ లు కూడా ఇచ్చి, ఇప్పుడు ఇరాన్ దాడులకు కేంద్రంగా మారుతున్న గల్ఫ్ దేశాలు ఎదురుదాడులు మాత్రం చేయడం లేదు. కానీ ఇప్పుడు హార్ముజ్ విషయంలో ఏదో ఒకటి చేయకపోతే తమ చమురు వ్యాపారాలు దెబ్బతినే పరిస్ధితులు ఎదురవుతుండటంతో మనసు మార్చుకుంటున్నాయి. ఇందులో అమెరికా సన్నిహిత దేశాలు సౌదీ అరేబియా (Saudi arabia), యూఏఈ (UAE)ముందున్నాయి. వీటి తర్వాత బహ్రెయిన్ కూడా ఉంది.

UAE and Saudi Arabia Weigh Military Intervention to Force Open Strait of Hormuz

అమెరికా ఇరాన్ లో భూతల దాడులకు సిద్దమవుతోంది. అదే సమయంలో స్థానిక పరిస్ధితులపై పట్టున్న తాము కూడా రంగంలోకి దిగితే ఇరాన్ ను సులువుగా ఓడించవచ్చనే అంచనాలతో ఈ వార్ లోకి దిగేందుకు సౌదీ అరేబియా, యూఏఈ సిద్ధమవుతున్నాయి. ఈ రెండూ అమెరికాకు మంచి మిత్రులు, ఇరాన్ కు బద్ధ శత్రువులు. అందుకే ఈ యుద్దంలో ఇరాన్ ఎక్కువగా ఈ రెండు దేశాలపైనే దాడులు చేస్తోంది. దీంతో ఇప్పుడు హార్ముజ్ జలసంధిని తెరిపించే పేరుతో యుద్దంలోకి అడుగుపెట్టేందుకు సౌదీ, యూఏఈ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మేరకు ఐరాస అనుమతి కోసం ఈ రెండు దేశాలు లాబీయింగ్ ప్రారంభించాయి. ఇదే బాటలో ఉన్న మరో దేశం బహ్రెయిన్ కూడా ఐరాసలో తీర్మానానికి మద్దతిచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+