ఇరాన్ పై అణుదాడికి గ్రీన్ సిగ్నల్ ? ఐరాసకు కీలక అధికారి గుడ్ బై..!

ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి తాము మొదలుపెట్టిన యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్దితుల్లోకి జారిపోతున్న అమెరికా ఇప్పుడు ఆ దేశంపై అణ్వాయుధ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఐక్యరాజ్యసమితి (UN) కూడా అనుమతివ్వబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఓ కీలక అధికారి ఐరాసకు రాజీనామా చేశారు. దీంతో పాటు ఆయన ఐరాసపై ఘాటు వ్యాఖ్యలతో ఓ ట్వీట్ కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

ఇరాన్‌లో అణ్వాయుధాల వాడకానికి దారితీసే ఒక పరిస్థితికి ఐరాస సన్నద్ధమవుతోందని ఆరోపిస్తూ సంస్ధలోని పేట్రియాటిక్ విజన్ అనే విభాగానికి ప్రధాన ప్రతినిధిగా ఉన్న మొహమ్మద్ సఫా తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ ఆయన ఒక లేఖను కూడా జతచేశారు. చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఐరాసలోని కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు ఒక శక్తివంతమైన లాబీకి సేవ చేస్తున్నారని సఫా ఆరోపించారు. ఇరాన్‌లో అణ్వాయుధాల వాడకానికి ఐరాశ సన్నాహాలు చేస్తున్న తరుణంలో, ప్రజలు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు.

UN-Linked Official Quits Over Nuclear Weapon usage plans in iran

ఇది టెహ్రాన్ చిత్రం. చదువుకోని, ప్రయాణాలు చేయని, ఎన్నడూ సైన్యంలో పనిచేయని, దానిపై బాంబులు వేయాలనే ఆలోచనకే నోరూరిస్తున్న యుద్ధోన్మాదులారా..ఇదిగో మీకోసం. ఇది తక్కువ జనాభా ఉన్న ఎడారి కాదు. ఇక్కడ కుటుంబాలు, పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నాయి. కలలు కనే సాధారణ శ్రామిక వర్గ ప్రజలు ఉన్నారు. యుద్ధం కోరుకునే మీరు రోగులు అని ఆయన పోస్టులో మండిపడ్డారు. టెహ్రాన్ దాదాపు కోటి మంది జనాభా ఉన్న నగరమని, వాషింగ్టన్, బెర్లిన్, పారిస్, లండన్ లేదా అంతకు మించిన నగరాలపై అణ్వాయుధాలతో దాడి చేయడాన్ని ఊహించుకోమని ఆయన కోరారు. ఈ విషయం లీక్ చేయడం కోసం తాను దౌత్య వృత్తిని వదులుకున్నానని, మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నేరంలో భాగం కాకుండా, దానికి సాక్షిగా నిలవకుండా ఉండేందుకు, మరీ ఆలస్యం కాకముందే అణు శీతాకాలాన్ని నివారించే ప్రయత్నంలో తన విధుల్ని నిలిపేశానని తెలిపారు.

UN-Linked Official Quits Over Nuclear Weapon usage plans in iran

అమెరికాలో "రాజులు వద్దు" అనే నినాదంతో దాదాపు కోటి మంది నిరసన తెలిపిన సంఘటనలను ప్రస్తావిస్తూ.. అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని, ఎందుకంటే అది ప్రమాదకరమని తెలిపారు. ఇప్పుడే చర్యలు తీసుకోవాలని, ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని కోరారు. వీధుల్లోకి రండి, మన మానవత్వం భవిష్యత్తు కోసం నిరసన తెలియజేయాలని కోరారు. ప్రజలు మాత్రమే దీనిని ఆపగలరన్నారు. చరిత్ర మనల్ని గుర్తుంచుకుంటుందన్నారు. తాను 2023లోనే రాజీనామా చేయాలనుకున్నానని, దానికోసం మూడేళ్లుగా ఓపిక పట్టానని సఫా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంఘర్షణలను ఆయన ప్రస్తావిస్తూ, ఐక్యరాజ్యసమితిలోని కొంతమంది అధికారులు ఇజ్రాయెల్, అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని ఆరోపించడానికి ఇష్టపడటం లేదన్నారు. ఐరాస తనను వదిలేసిందని, తనకు, కుటుంబానికి ప్రాణ బెదిరింపులు వచ్చాయన్నారు. ఐరాసలో తనపై సెన్సార్ విధించారని, అయితే అది ఆ సంస్థ ద్వారా కాదని, ఆ లాబీకి సేవ చేయడానికి తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిన కొందరు ఉన్నతాధికారుల ద్వారా జరిగిందని ఆరోపించారు. దీనిపై ఐరాస స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+