వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగిల్ డోసు టీకాకు బ్రిటన్ ఆమోదం -Johnson Johnson Covid Vaccine భేషన్న ప్రధాని -భారత్‌లో ఏదంటే

|
Google Oneindia TeluguNews

కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు నుంచీ ఆందోళన చెందుతున్నట్లుగానే అగ్రరాజ్యాలుగా వెలుగొందుతోన్న ధనిక దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో దూసుకుపోతున్నాయి. అమెరికా జనాభా 33 కోట్లు కోగా, అందులో 28కోట్ల మంది ఇప్పటికే వ్యాక్సిన్లు పొందారు. ఇక బ్రిటన్ తాజాగా నాలుగో టీకాకు ఆమోదం తెలిపింది.

భారత్‌కు అమెరికా వ్యాక్సిన్ సాయం వట్టిదేనా? ముఖేష్ బాంబు-బైడెన్ మంత్రులు బ్లింకెన్, అస్టిన్‌తో జైశంకర్ చర్చలుభారత్‌కు అమెరికా వ్యాక్సిన్ సాయం వట్టిదేనా? ముఖేష్ బాంబు-బైడెన్ మంత్రులు బ్లింకెన్, అస్టిన్‌తో జైశంకర్ చర్చలు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్‌ వ్యాక్సిన్లన్నీ రెండు డోసులవి కాగా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు చెందిన సింగిల్‌ డోస్‌ టీకాకు యూకే ఆమోదం తెలిపింది. ఆమోదం తెలపిన తొలిరేజే జాన్సన్ అండ్ జాన్సన్ కు రెండు కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్లను బ్రిటన్‌ ప్రభుత్వం ఆర్డర్‌ చేసింది. రాబోయే రోజుల్లో సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ముఖ్యమైన పాత్ర పోషించబోతోందని యూకే హెల్త్‌ అండ్‌ సోషల్‌ కేర్‌ విభాగం తెలిపింది.

UK Approves Single Shot Johnson and Johnson Covid Vaccine

అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ హెల్త్ కేర్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా కొనసాగుతూ, కొవిడ్ వ్యాక్సిన్లపైనా ప్రయోగాలు చేసి, సింగిల్ షాట్ టీకాను రూపొందించింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా 72శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని అమెరికా ట్రయల్స్‌లో వెల్లడైంది. ప్రస్తుతం యూకేలో దాదాపు సగం జనాభాకు ఏదో ఒక వ్యాక్సిన్‌ కనీసం ఒక డోస్‌ అయినా పూర్తి అయింది. మిగతా వాక్సిన్లతో పోలిస్తే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోసు టీకా ఆలస్యంగానే అనుమతులు పొందింది. అయినప్పటికీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఆమోదంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటుందని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

UK Approves Single Shot Johnson and Johnson Covid Vaccine

యూకేలో ఇటీవల నమోదవుతోన్న కొత్తవాటిలో 75 శాతం కేసులు B.1.617 వేరియంట్ వల్లేనని బ్రిటన్ హెల్త్ అధికారులు చెబుతున్నారు. ఈ B.1.617 వేరియంట్ ను మొదట భారత్ లో గుర్తించడం తెలిసిందే. యూకేలో తాజాగా 3,542 కొత్త కేసులు, 10 మరణాలతో కలిపి మొత్తం కేసులు 44.77లక్షలు, మొత్తం మరణాలు 1.27లక్షలుగా ఉన్నాయి. ఇక..

మోదీపై భారీ కుట్ర: అమెరికాలో మంత్రి Jaishankar గగ్గోలు -Vaccineమైత్రికి కసరత్తు -హిందూత్వ ఇమేజ్ పైనామోదీపై భారీ కుట్ర: అమెరికాలో మంత్రి Jaishankar గగ్గోలు -Vaccineమైత్రికి కసరత్తు -హిందూత్వ ఇమేజ్ పైనా

భారత్ లాంటి అభివృద్ది చెందుతోన్న దేశాలు సైతం వ్యాక్సిన్ల కొరత ఎదుర్కొంటున్న దరిమిలా సింగిల్ డోసు టీకాలపై ఫోకస్ పెరిగింది. ఇప్పుడు బ్రిటన్ జాన్సన్ అండ్ జాన్సన్ వారి సింగిల్ డోసు టీకాకు ఆమోదం తెలుపగా, భారత్ లోనూ ఆ దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రష్యా తయారీ స్ఫుత్నివ్-వి వ్యాక్సిన్ రెండు డోసులది కాగా, అదే బ్రాండ్ 'స్ఫుత్నిక్ -వి లైట్' పేరుతో సింగిల్ డోసు టీకాను అభివృద్ధి చేసింది. స్ఫుత్నిక్ లైట్ కు త్వరలోనే భారత్ అనుమతి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Recommended Video

#Krishnapatnam Medicine ఆయుర్వేదానికి పెరిగిన డిమాండ్.. పుత్తూరు కట్టు, చేప మందు సక్సెస్

English summary
Britain on Friday approved the use of a fourth Covid vaccine, hoping to boost a countrywide inoculation drive to allow its economy to reopen fully despite concerns about a new variant. The Medicines and Healthcare products Regulatory Agency (MHRA) approved the single-shot Johnson & Johnson jab, after previously backing the Pfizer, AstraZeneca and Moderna shots. Prime Minister Boris Johnson called it "very welcome news and another boost to our hugely successful vaccination programme".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X