శుభవార్త: యూకేలో వర్క్‌వీసా ఈజీ, నిబంధనలు సులభతరం

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: యూకేలో చదువుకుంటున్న విద్యార్థులకు శుభవార్త. వీసా నిబంధనలను యూకే సరళతరం చేసింది.దీంతో స్టూడెంట్ వీసా నుండి వర్క్ వీసాలోకి మారేందుకు నిబంధనలు సరళతరమయ్యాయి. 2018 జనవరి 11 వ, తేది నుండి ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు అమల్లోకి రానున్నాయి.

అమెరికాలో హెచ్ 1 బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం కావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్యోగం ఉంటే తప్ప వీసా దొరకడం కష్టంగా మారింది. అలాంటి తరుణంలో యూకే వీసాలు ఇండియా విద్యార్థులకు ఉపయోగపడే ఛాన్స్ ‌ లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యూకేలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకొనేలోపుగానే వర్క్ వీసాలోకి మారే అవకాశం ఏర్పడింది.దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

వీసా నిబంధనలు సులభతరం

వీసా నిబంధనలు సులభతరం

వీసా నిబంధనలు సులభతరం చేస్తూ యూకే నిర్ణయం తీసుకొంది. యూకేలో విద్యాభ్యాసం చేస్తున్న విదద్యార్థులు స్టూడెంట్ వీసా నుండి వర్క్ వీసాలోకి సులభంగా మారే వెసులుబాటు దక్కుతోంది విదేశీ విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేసుకొనే లోపలే టైర్ 2 వీసా స్కిల్డ్ వర్క్ వీసాలోకి మారిపోవచ్చు.

మారిన నిబంధనలు ఇలా

మారిన నిబంధనలు ఇలా

మారిన నిబంధనల ప్రకారంగా టైర్ 2 వీసాను విద్యార్థులు పాందాలంటే కనీసం డిగ్రీ పూర్తి చేయాల్సి ఉండేది. కానీ, వీసా నిబంధనలను సరళతరం చేయడంతో కొన్ని నెలలకు ముందే టైర్ 2 వీసా కోసం విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు. దరిమిలా ఉద్యోగ వేటలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదనిత నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్టూడెంట్ వీసాలిలా

స్టూడెంట్ వీసాలిలా

యూకే వెళ్తున్న విద్యార్థులకు స్టూడెండ్‌ వీసా ను కోర్సు కాల వ్యవధితో పాటు 4 నెలల కాలానికి కలిపి ఇస్తున్నారు. కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటం విదేశీ విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడం ఇబ్బంది కల్గిస్తోంది. ఆ సమయంలో ఉద్యోగం దొరకకపోతే స్వదేశానికి తిరిగి రావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

క్లిష్టమైన నిబంధనలు మార్పు

క్లిష్టమైన నిబంధనలు మార్పు

క్లిష్టమైన నిబంధనలను మార్పు చేశారు.టైర్‌-4 వీసా నుంచి టైర్‌-2వీసాల్లోకి మారడం కూడ గతంలో క్లిష్టతరంగా ఉంటుంది. ఆ లోపల డిగ్రీ పొందలేకపోతే, స్టూడెంట్‌ వీసాకు కూడా కాలం చెల్లిపోతుంది. ఈ తరహ వీసా నిబంధనలను మార్పు చేశారు. ఈ మార్పులతో స్టూడెంట్ వీసా నుండి వర్క్ వీసాను సులభంగా పొందే అవకాశం ఏర్పడింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
International students in the UK will soon enjoy more flexibility in switching over to work visas, with new immigration rules set to be introduced from January 11.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి