UK election Results: బ్రిటన్ ఎన్నికల్లో గెలిచిన భారతీయులు వీరే ! హౌస్ ఆఫ్ కామన్స్ కు..
బ్రిటన్ లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇందులో అధికార కన్సర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వగా.. లేబర్ పార్టీ 14 ఏళ్ల తర్వాత ఘన విజయం సాధింంచి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కాబోతున్నారు. అయితే కన్సర్వేటివ్ లు ఓటమిపాలయ్యినా ఇప్పటివరకూ ప్రధానిగా ఉన్న రిషీ సునాక్ తో పాటు పలువురు భారతీయులు మాత్రం ఈ ఎన్నికల్లో గెలుపొందారు.
650 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ కామన్స్ కు జరిగిన ఎన్నికల్లో పలువురు భారతీయ మూలాలున్న వారు గెలుపొందారు. ఇందులో రుషీ సునాక్ తో పాటు ప్రీత్ కౌర్ గిల్, ప్రీతీ పటేల్, గగన్ మొహీంద్రా, కనిష్కా నారాయణ్, నవేందు మిశ్రా, లీసా నందీ ఉన్నారు. సువెల్లా బ్రేవర్మెన్, శివానీ రాజా, తమన్ జీత్ సింగ్ థేసీ ఉన్నారు. వీరిలో పలువురు లేబర్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. వీరంతా హౌస్ ఆఫ్ కామన్స్ లో అడుగుపెట్టబోతున్నారు.

ఈసారి బ్రిటన్ ఎన్నికల్లో మొత్తం 107 మంది భారతీయ మూలాలున్న నేతలు పోటీ చేశారు. వీరిలో 26 మంది గెలిచారు. ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంట్ లో కేవలం 15 మంది మాత్రమే భారతీయ మూలాలున్న ఎంపీలున్నారు. దీంతో పోలిస్తే మరో 11 మంది ఈసారి అదనంగా ఎన్నికైనట్లయింది. అంతే కాదు బ్రిటన్ లో బ్రిటీష్ ఇండియన్ల ప్రభావం ఏ స్ధాయిలో ఉందో ఈ ఫలితాలు మరోసారి రుజువు చేసాయి. గత ఎన్నికల్లో లేబర్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన బ్రిటీష్ ఇండియన్లు.. ఈసారి మాత్రం ఆ పార్టీకి అండగా నిలిచారు.












Click it and Unblock the Notifications