ఉద్యోగినితో హాట్ లిప్‌లాక్: కోవిడ్ రూల్స్ బ్రేక్: పదవిని పోగొట్టుకున్న బ్రిటన్ మంత్రి

లండన్: తన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో పెట్టుకున్న లిప్‌లాక్ వ్యవహారం.. బ్రిటన్ ఆరోగ్యమంత్రి మ్యాట్ హాన్‌కాక్ పదవిని ఊడగొట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశ ప్రభుత్వం అమలు చేస్తోన్న కఠిన నిబంధనలను స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రే ఉల్లంఘించారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన రాజీనామా పత్రాన్ని ఆయన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు పంపించారు. ఆయన రాజీనామాను బోరిస్ జాన్సన్ వెంటనే ఆమోదించారు. దీనిపై బ్రిటన్‌కు చెందిన ది సన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ఆదాయపు పన్నుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి హాన్‌కాక్ తన కార్యాలయంలో ఓ ఉద్యోగినిని నియమించుకున్నారు. ఆమెను తన కార్యాలయం ఆవరణలో ఆ ఉద్యోగినిని ముద్దాడుతూ కెమెరా కంటికి చిక్కారు. కిందటి నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు అక్కడి మీడియాలో ప్రచురితమయ్యాయి. ఈ వ్యవహారంపై హాన్‌కాక్ పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్నారు. దీనితో దిగివచ్చిన ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పారు. తాను చేసిన పనికి చింతిస్తున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ- వివాదాలు చల్లారలేదు. దీనితో తన పదవికి రాజీనామా చేశారు.

UK Health minister Matt Hancock resigned after breaking the Coronavirus rules

తన రాజీనామా పత్రాన్ని బోరిస్ జాన్సన్‌కు పంపించారు. ఆయన దాన్ని వెంటనే ఆమోదించారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో కఠిన మార్గదర్శకాలను జారీ చేయడం, వాటిని అంతే పకడ్బందీగా అమలు పర్చడంలో మ్యాట్ హాన్‌కాక్ విజయవంతమయ్యారని, ఆయన చేసిన సేవలు గర్వకారణమంటూ బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. రాజీనామాను ఆమోదిస్తున్న విషయాన్ని హాన్‌కాక్‌కు తెలియజేస్తూ అధికారికంగా సమాచారాన్ని పంపించారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరించారని ప్రశంసించారు. అయినప్పటికీ- అవే మార్గదర్శకాలు, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడం బాధాకరమనే వ్యాఖ్యలు బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో వ్యక్తం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+