వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా యూకే-ఇండియా అవార్డులు: శిల్పాశెట్టికి గ్లోబల్ ఇండియన్ ఐకాన్ అవార్డు

|
Google Oneindia TeluguNews

లండన్: యూకే భారత్‌ల మధ్య బంధం బలోపేతం అయిన దృష్ట్యా యూకే-ఇండియా వీక్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా అవార్డుల కార్యక్రమం లండన్‌లో ఘనంగా జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేసిన వ్యక్తులకు సంస్థలకు ఈ కార్యక్రమంలో అవార్డులను అందజేశారు. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 400మంది సీనియర్ నేతలు హాజరయ్యారు.

ఇందులో వాణిజ్య రంగం, రాజకీయ, దౌత్య, మీడియా, కళలు మరియు సంస్కృతి రంగాల నుంచి అతిథులుగా ప్రముఖలు హాజరయ్యారు. వాణిజ్య రంగంలో విశేష అనుభవం ఉన్న సునీల్ భారతి మిట్టల్, బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్, ఎంపీ బారీ గార్డెనర్, ఎంపీ లార్డ్ మార్లండ్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి యూకే ఇండియా అవార్డుల విజేతలను ప్రకటించారు.

UK-India Week 2018: Global Indian icon award goes to Shilpa Shetty

ఈ ఏడాది యూకే ఇండియా కార్యక్రమానికి బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రెండు దేశాల మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలను పురస్కరించుకుని ఇందుకోసం కృషి చేసిన వ్యక్తలకు, సంస్థలకు యూకే ఇండియా అవార్డులు ఇవ్వడం జరుగుతోందని యూకే ఇండియా వీక్ వ్యవస్థాపకులు, బ్రిటీష్ ఇండియా పారిశ్రామికవేత్త, రాజకీయ విశ్లేషకులు మనోజ్ లాద్వా తెలిపారు.

UK-India Week 2018: Global Indian icon award goes to Shilpa Shetty

2వ యూకే-ఇండియా అవార్డుల జాబితా:

*SBI స్పాన్సర్డ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అవార్డు: LSE (లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్), నిఖిల్ రతీ అవార్డును అందుకున్నారు

*ఈ ఏడాది ఉత్తమ న్యాయశాఖ సంస్థ: భారత్‌కు చెందిన ట్రైలీగల్ సంస్థ

* ఈ ఏడాది ఉత్తమ కన్సల్టెన్సీ సంస్థ: సన్నాం 4, గ్లోబల్ కన్సల్టెన్సీ కంపెనీ, సన్నాం S4-ఎడ్వర్డ్ డిక్సాన్ అవార్డు అందుకున్నారు

* మీడియా ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డు పార్టిషన్ మ్యూజియం: అదితి కిష్వార్ దేశాయ్ అవార్డు అందుకున్నారు

* ఈ ఏడాది ఉత్తమ పీఆర్ సంస్థ: స్టర్టింగ్ మీడియా: నటాష్ ముదార్ అవార్డు అందుకున్నారు

* సైన్స్ ఇన్నోవేషన్ & టెక్ అవార్డు: కార్బన్ క్లీన్ సొల్యూషన్స్, అనిరుద్ద శర్మ అవార్డు అందుకున్నారు

* సన్ గ్లోబల్ డీల్ ఆఫ్ ద ఇయర్: UK IREDA, సతీష్ కుమార్ భార్గవ అందుకున్నారు

* ట్రేడ్ ప్రమోషన్ &ఇన్వెస్ట్‌మెంట్‌ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ : మాంచెస్టర్ ఇండియా పార్ట్‌నర్షిప్

* ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్ ప్రెజెంటెడ్ బై: పట్ సైనీ, పార్ట్‌నర్ అండ్ హెడ్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్, పెన్నింగ్టన్ మాంచెస్

* సోషల్ ఇంపాక్ట్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ : స్టాండర్డ్ ఛార్టర్డ్, కరేన్ రామ్- సోషల్ ఇంపాక్ట్

* యూకే ఇండియా రిలేషన్స్ అవార్డు: బ్రిటీష్ కౌన్సిల్ ఇండియా, అలన్ జెమ్మెల్ ఈ అవార్డును అందుకున్నారు

* గ్లోబల్ ఇండియన్ ఐకాన్ అవార్డు: శిల్పా శెట్టి కుంద్రా.

English summary
The 2nd Annual UK-India Awards ceremony was held to celebrate the winning partnership between the UK and India. The 2018 event acknowledged and celebrated individuals and organisations who have made a significant contribution to strengthening the bilateral relationship.
Read in English: UK-India Week 2018 awards
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X