
రిషి సనాక్ ప్రధానిగా లైన్ క్లియర్ - గెలుపు లెక్క ఇలా : తాజా ప్రకటనతో..!!
బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతకి చెందిన రిషి సనాక్ మరో సారి బరిలో నిలిచారు. ఈ సారి ఆయనకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. రెండు నెలల క్రితం జరిగిన బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో రిషి సనాక్ పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో లిజ్ ట్రస్ ప్రధానిగా ఎన్నికయ్యారు. కానీ, 45 రోజుల్లోనే లిజ్ ట్రస్ ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. రాజీనామా చేసారు. బ్రిటన్ లో నెలకొన్న ఆర్దిక - రాజకీయ సంక్షోభంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి బ్రిటన్ ప్రధాని ఎన్నిక మొదలైంది.
గతంలో లిజ్ ట్రస్ - రిషి సనాక్ మధ్య ప్రధాన పోటీ జరిగింది. కానీ, ట్రస్ చేసిన వగ్దానాలు నెరవేర్చటంలో ఎదురవుతున్న సమస్యలతో పదవి వీడారు. ఇప్పుడు రిషి సనాక్ కీలక ప్రకటన చేసారు. ఆయన చేసిన ట్వీట్ తో బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయి. యూకే గొప్ప దేశమని.. దేశ ప్రజలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని రిషి సునాక్ ట్వీట్ చేశారు. అందుకే తాను కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా తదుపరి ప్రధానమంత్రిగా పోటీలో నిలబడతాను అని తెలిపారు. తన నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రతి స్థాయిలో సమగ్రత, వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనం వుంటుందని, పనులు పూర్తి చేయడానిక ప్రతీ రోజూ పని చేస్తామని రిషి సునాక్ తెలిపారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి స్పష్టమైన ప్రణాళిక ఉన్నట్లు రిషి వివరించారు. రిషి సనాక్ కు పార్లమెంట్ లోని 128 మంది టోరీ సభ్యుల మద్దతుతో తొలి స్థానంలో నిలిచారు. మాజీ ప్రధాని బోరిస్ రేసు నుంచి తప్పుకోవటంతో ఇప్పుడు రిషి సనాక్.. పెన్నీ మోర్టాంట్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. బోరిస్ జాన్సన్ సేవలను రిషి ప్రశంసించారు. ఆయన ఇప్పుడు రేసు నుంచి తప్పుకోవటంతో పాటుగా రిషికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుత సంక్షోభం ఎంత పెద్దదైనా అవకాశాలను సమర్ధంగా వినియోగించుకుంటే అధిగమించవచ్చని వివరించారు. తాను గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేస్తానని ప్రకటించారు. సవాళ్లు అధిగమించేందుకు తాను ప్రయత్నం చేస్తానని రిషి వెల్లడించారు.
The United Kingdom is a great country but we face a profound economic crisis.
— Rishi Sunak (@RishiSunak) October 23, 2022
That’s why I am standing to be Leader of the Conservative Party and your next Prime Minister.
I want to fix our economy, unite our Party and deliver for our country. pic.twitter.com/BppG9CytAK