Ukrain: దిగొచ్చిన ఉక్రెయిన్.. వివాదాస్పద పోస్ట్ పై క్షమాపణలు..!
ఎట్టకేలకు ఉక్రెయిన్ భారత్ కు క్షమాపణలు చెప్పింది. ఉక్రెయిన్ దేశ రక్షణ శాఖ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆరాధ్య దైవమైన 'కాళీ మాత'ను అగౌరవపరిచేలా వివాదాస్పద ట్వీట్ చేసి భారతీయుల ఆగ్రహానికి గురైంది. పెద్ద ఎత్తున భారతీయుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది ఉక్రెయిన్ రక్షణ విభాగం. అయితే, హిందువుల మనోభావాలను గాయపర్చి ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా జరిగినందుకు చింతిస్తున్నట్లు ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జాపరోవా ప్రకటించారు.
ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ షేర్ చేసిన కాళి దేవతను పోలిన కార్టూన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో ఆగ్రహానికి కారరణమైంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఈ ట్వీట్‌పై స్పందిస్తూ.. 'ఇటీవల ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి భారతదేశం నుంచి మద్దతును కోరుతూ ఢిల్లీలో ఉన్నారు. దీని వెనుక ఉక్రెయిన్ ప్రభుత్వ అసలు ముఖం దాగి ఉంది. భారతీయ దేవత మా కాళి ప్రచార పోస్టర్‌పై వ్యంగ్య చిత్రం ఇది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలపై ప్రభావం చూపుతుందని ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్ రక్షణ శాఖ రష్యాలో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత వెలువడిన ఓ పొగపై కాళీ మాతను తలపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తు తెచ్చేలా ఓ ఫొటోను ట్వీట్ చేసింది.'వర్క్ ఆఫ్ ఆర్ట్' అనే క్యాప్షన్‌తో స్టర్టు ధరించిన స్త్రీ బొమ్మను ట్వీట్ చేసింది. కాళీ మాతను పోలినట్లు ఈ ఫొటోను చిత్రీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, భారతీయులు ఉక్రెయిన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఆ ట్వీట్ డిలిట్ చేశారు.

కేవలం ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పకపోవడంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమిన్ జాపరోవా భారత్ కు క్షమాపణలు చెప్పారు. ఎమిన్ జాపరోవా గత నెలలో భారత్‌లో పర్యటించారు. రష్యా దాడులతో అతలాకుతలమైన పరిస్థితుల్లో తమ దేశానికి మద్దతు పలకడమే నిజమైన విశ్వగురువుకు న్యాయం అనిపించుకుంటుందని భారత్‌ను ఉద్దేశించి మాట్లాడారు.












Click it and Unblock the Notifications