రష్యా సైన్యం చేతిలోకి ఉక్రెయిన్ రాజధాని కీవ్.. 118 మిలటరీ స్థావరాలు ధ్వంసం

ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుతో విరుచుకుపడుతోంది. యుద్ధపోరు మరింత భీకరంగా మారింది. దీంతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలో ఉన్న కీలకమైన ఎయిర్ పోర్టును తాము స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

 ర‌ష్యా బ‌ల‌గాల చేతిలోకి కీవ్‌

ర‌ష్యా బ‌ల‌గాల చేతిలోకి కీవ్‌

ఈ పరిణామాలతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు కూడా వేగంగా మారిపోతున్నాయి. రష్యా బలగాలు ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకోవడంతో సైన్యాన్ని కీవ్‌కు తరలించడానికి మరింత సులభరతం అయింది. అటు హోస్టోమెల్ ఎయిర్ పోర్టును కూడా స్వాదీనం చేసుకోవడంతో తన రక్షణ శాఖకు చెందిన భారీ విమానాలు వచ్చే అవకాశం ఏర్పడింది . మరోవైపు కీవ్ నగరం కూడా దాదాపు రష్యా బలగాల చేతిల్లోకి వెళ్లిపోయింది.

 ఉక్రెయిన్‌లో 118 మిలటరీ ల‌క్ష్యాలు ధ్వంసం

ఉక్రెయిన్‌లో 118 మిలటరీ ల‌క్ష్యాలు ధ్వంసం


ఉక్రెయిన్‌లోని పలు సైనిక స్థావరాలు, నగరాలపై రష్యా వైమానికి దాడులకు పాల్పడింది. ఇప్పటి వరకు మొత్తం 118 మిలటరీ స్థావరాలు ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. రాజధాని కీవ్‌, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌తో పాటు పలు ఇతర పట్టణాల్లోకి రష్యా సేనలు ప్రవేశించాయి. దాడుల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌కు మూడు వైపుల నుంచి దాడులు చేసేందుకు యుద్ధ ట్యాంకులను పంపింది. బీకర పోరును సాగిస్తోంది.

 యుద్ధాన్ని ఆపేది లేదు..

యుద్ధాన్ని ఆపేది లేదు..

మరోవైపు రష్యా బలగాల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ సైన్యం తమ శక్తివంచనలేకుండా పోరాడుతుంది. ఈ దాడుల్లో రష్యాకు చెందిన దాదాపు 1000 మంది సైనికులను తాము మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు యుద్ధాన్ని ఆపవద్దంటూ తమ సైన్యాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+