వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలో దిగిన జో బైడెన్: ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఎమర్జెన్సీ ఫోన్ కాల్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో కొద్ది రోజులుగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం తొలగిపోవట్లేదు. మరింత తీవ్ర రూపాన్ని దాల్చుతూనే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన వివాదం పరిష్కారానికి నోచుకోనంతగా ముదిరినట్టు కనిపిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉక్రెయిన్‌లో నెలకొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన రష్యన్ సైనికుల్లో 50 శాతం మంది యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారంటూ అమెరికా అంచనా వేసింది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని నివారించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కావడానికీ ఆయన వెనుకాడట్లేదు. ఇదివరకు అగ్రరాజ్యం మధ్యవర్తిత్వం నిర్వహించినప్పటికీ.. అది విఫలమైంది. దీనితో బైడెన్ స్వయంగా ఈ సంక్షోభ నివారణకు పూనుకున్నారు. రష్యా.. యుద్ధానికి దిగడమంటూ జరిగితే ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని ఇదివరకే అమెరికన్ సెనెట్ భరోసా ఇచ్చింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని సైతం ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఇప్పుడు తాజాగా- అమెరికా మరో అడుగు ముందుకేసింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి తన మిత్రదేశం ఫ్రాన్స్‌ను కూడా బరిలో దింపనుంది. రష్యాను నియంత్రించే విషయంలో ఫ్రాన్స్ సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. దీనికోసం జో బైడెన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌కు ఫోన్ చేశారు. రష్యాపై అనుసరించాల్సిన దౌత్య విధానాల గురించి చర్చించారు. జో బైడెన్- ఇమ్మానుయెల్ మాక్రాన్ మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఇది రెండోసారి.

Ukraine crisis: US President Joe Biden spoke with French counterpart Emmanuel Macron

ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా రష్యా వ్యవహరిస్తోందని, ఆ దూకుడును నియంత్రించడానికి కలిసి పని చేద్దామని ఈ సందర్భంగా జో బైడెన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడికి సూచించారని వైట్‌హౌస్ అధికారిక ప్రతినిధి తెలిపారు. బైడెన్-మాక్రాన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగిన ఫోన్ సంభాషణ వివరాలను వెల్లడించారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా.. తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవడానికి ఎలాంటి వ్యూహాలు, ఒత్తిళ్లను అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై ప్రధానంగా ఈ సంభాషణ సాగినట్లు చెప్పారు.

సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మోహరింపజేసిన తన సైనిక బలగాలను రష్యా ఉపసంహరించుకుంటేనే ఈ ఉద్రిక్త పరిస్థితులు చల్లారుతాయని బైడెన్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే- బలగాల ఉపసంహరణ కోసం తాము చేయాల్సిందంతా చేస్తున్నామని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. మరోవంక- వ్లాదిమిర్ పుతిన్ కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఫోన్‌లో సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగాలనే ఆలోచన లేదని స్పష్టం చేసినట్లు పుతిన్ అధికారిక నివాసం గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ ప్రకటించింది.

English summary
US President Joe Biden spoke with French President Emmanuel Macron on Sunday, the White House said, amid Western fears Russia is planning to invade Ukraine, which Moscow denies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X