మోడీతో జెలెన్ స్కీ మంతనాలు: ప్రాణ నష్టంపై విచారం, శాంతి చర్చలు
ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. రష్యా రెచ్చిపోవడంతో.. సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. రష్యాపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టగా.. 11 అనుకూలంగా ఓట్లు వచ్చాయి. అయితే భారత్, చైనా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. దీంతో విగిపోయింది. అయితే తమకు సపోర్ట్ చేసిన ఇండియాను రష్యా కొనియాడింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ లైన్‌లోకి వచ్చారు. ప్రధాని మోడీతో మాట్లాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
రష్యా తమ దేశంపై చేసిన దాడిని మోడీకి వివరించారు. లక్ష మందితో దాడి చేసి భీతావాహ వాతావరణం నెలకొల్పారని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు పీఎంవో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. హింసను నిలిపివేయాలని.. చర్చలు జరపాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. శాంతి ప్రయత్నాల కోసం భారత్ యత్నిస్తోందని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ పౌరులు, మిగతా జనం గురించి మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఇటు ఉక్రెయిన్‌లో భారత విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతం. దేశం విడిచి వెళ్లే మార్గం తెలియక ఆందోళన చెందుతున్నారు. నిన్న 40 మంది భారత విద్యార్థుల బృందం 8 కిలోమీటర్లు నడిచి పోలెండ్ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. వారందరూ ల్వీవ్ నగరంలోని ఓ మెడికల్ వర్సిటీలో మెడిసన్ చేస్తున్నారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో స్వదేశం చేరడానికి ఇబ్బందులు తప్పడం లేదు. భారత విద్యార్థులను వర్సిటీకి చెందిన ఓ బస్సు 70 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చింది.
పోలెండ్ సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టింది. ఆపై వారందరూ సరిహద్దు వద్దకు కాలినడకన చేరుకున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలైన ల్వీవ్, చెర్న్ విట్సిలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసింది. పోలెండ్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు సహకరించేందుకు రష్యన్ భాష మాట్లాడే అధికారులను అక్కడ నియమించింది.












Click it and Unblock the Notifications