వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్, రష్యా: హడావుడి దౌత్య ప్రయత్నాలలో ఫలితం ఉంటుందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అమెరికా, రష్యా దౌత్యవేత్తల చర్చలు

ఈ వారంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రధానంగా మూడు పనుల మీద యూరోప్ వెళ్లారు. రష్యా నుంచి యుక్రెయిన్ సైనిక ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన యూరోప్ పర్యటన సాగింది.

అమెరికా యుక్రెయిన్‌కు మద్దతు ఇస్తుందనే భరోసా కల్పించేందుకు, అమెరికా మిత్ర దేశాల మద్దతును కూడగట్టేందుకు, రష్యా నేతలతో చర్చలు జరిపి దౌత్యపరమైన పరిష్కారాన్ని సాధించేందుకు ఆయన యూరోప్ వెళ్లారు.

అయితే, ఈ పర్యటన వెనుక సరైన ప్రణాళిక లేదు.

యుక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్‌కీ, విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతో బ్లింకెన్ సమావేశం కానుండడంపై అమెరికా అధికారులకు కేవలం రెండు రోజుల ముందే సమాచారం అందింది. వీరిద్దరితో పాటు యుక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయ అధికారులతోనూ బ్లింకెన్ సమావేశమయ్యారు.

ఈ పర్యటనలో బ్లింకెన్ "అమెరికా యుక్రెయిన్‌ వెంటే ఉంటుంది" అనే సందేశాన్ని పదే పదే చెప్పారు.

చర్చలా? యుద్ధమా అనేది తేల్చుకోవాల్సింది రష్యాయేనని ఆయన చెప్పారు.

రష్యా, యుక్రెయిన్ సరిహద్దుల్లో సైనికుడు

మొదటి రోజు సమావేశాల తర్వాత అమెరికా ప్రయత్నాలు ముందుకు కదులుతున్నట్లు కనిపించాయి.

ఇంతలో అదే రోజు అర్ధరాత్రికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ అంశంపై జోక్యం చేసుకున్నారు.

యుక్రెయిన్‌లో రష్యా తన సేనలను మోహరించడం పట్ల అమెరికా మిత్ర దేశాలతో తప్పనిసరిగా చర్చ జరుపుతుందని ఆయన ప్రకటించారు. రష్యా యుక్రెయిన్‌ను ఆక్రమించే అవకాశాలున్నాయని అన్నారు.

బైడెన్ అభిప్రాయాలకు కొంత మంది విదేశాంగ శాఖలో అధికారులు తలలూపారు. అయితే, దౌత్య విషయాలకొచ్చేసరికి కొన్ని నిజాలను చెప్పకుండా ఉంటేనే మంచిది.

బ్లింకెన్ క్వాడ్ దేశాల ప్రతినిధులను కలిసారు.

క్వాడ్ లక్ష్యాలు

బైడెన్ సమావేశం నిర్వహించిన మరుసటి రోజే బ్లింకెన్ క్వాడ్ మిత్ర దేశాలైన జర్మనీ, యూకే, ఫ్రాన్స్, బెర్లిన్ దేశాల ప్రతినిధులతో సమావేశం కావల్సి ఉంది. కానీ, ఆ రోజంతా ఆయన బైడెన్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడంతోనే సరిపోయింది. రష్యా యుక్రెయిన్‌ కు వ్యతిరేకంగా మిత్ర దేశాల ఐక్యతను ప్రదర్శించేందుకు ఆయనకు అవకాశం దక్కలేదు.

మరోవైపు యుక్రెయిన్‌లో అధ్యక్షుడు జెలెన్స్‌కీ మాత్రం ట్వీట్ల ద్వారా సందేశాలు పంపుతున్నారు. రష్యా ఉక్రెయిన్ ను ఆక్రమించుకునేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇతర ప్రభుత్వ సిబ్బంది చిరాకు పడుతున్నారు.

రష్యా యుక్రెయిన్‌ను ఆక్రమించిన పక్షంలో ఆ దేశం పై బిగుసుకుంటున్న ఆంక్షల గురించి సంయుక్త పత్రికా సమావేశంలో జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి అన్నాలెనా బేర్బాక్ మాట్లాడారు. కానీ, రష్యా నుంచి జర్మనీకి సరఫరా అయ్యే నోర్డ్ 2 గ్యాస్ పైప్ లైన్ సేవలను రద్దు చేసే అవకాశం ఉందేమోననే విషయం మాట్లాడేందుకు రెండు పక్షాలు ఆసక్తి చూపించలేదు.

ఇంధనం పై ఆంక్షలు విధిస్తే అవి రష్యా పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ, ఈ ఆంక్షలు విధించేలా కనిపించటం లేదు.

రష్యా సరఫరా చేసే సహజ ఇంధనం పై యూరోప్ ఆధారపడుతుంది. బైడెన్ కూడా అమెరికాలో పెరుగుతున్న పెట్రోల్ ధరల పట్ల రాజకీయంగా సున్నితంగా వ్యవహరిస్తున్నారు.

క్వాడ్ దేశాలకు ఇతర సమస్యలూ ఉన్నాయి.

రష్యాతో ప్రత్యేకమైన దౌత్య వ్యూహాన్ని అనుసరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రోన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ వారంలో యుక్రెయిన్‌ నుంచి బ్రిటిష్ వాణిజ్య విమానాలు షార్ట్ రేంజ్ యాంటీ ట్యాంక్ క్షిపణులను తీసుకుని వెళ్లేందుకు ఫ్రాన్స్, జర్మనీ మీదుగా తీసుకున్న సుదీర్ఘ మార్గాన్ని కొంత మంది గుర్తించారు.

అమెరికా, దాని మిత్ర దేశాలు ఈ ఆటను బాగా ఆడాలని చూస్తున్నాయి. కానీ, ఈ వారంలో జరిగిన సంఘటనలు రష్యాను ప్రోత్సహించేవిగా ఉన్నాయి.

బ్లింకెన్, రష్యా ప్రతినిధి సెర్గీ లావ్రోవ్ ల మధ్య శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశం కనులవిందుగా సాగింది.

స్విట్జర్లాండ్ లోని జెనీవా తీరంలో ప్రెసిడెంట్ విల్సన్ హోటల్ లో విలేఖరుల సమావేశం జరిగింది.

మీడియా ప్రశ్నలను తప్పించుకునేందుకు రష్యా ఉప ప్రధాన మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ ఒక కోట్ ర్యాక్ వెనుక దాగున్నారు.

ఈ విషయం గురించి ఏమీ మాట్లాడలేనని ప్రెస్ కార్యదర్శి మరియా జకారోవా అన్నారు.

లావ్రోవ్, బ్లింకెన్ ప్రారంభ ప్రసంగం చేశారు.

తాము చేసిన స్పష్టమైన ప్రతిపాదనలకు స్పష్టమైన సమాధానాలు ఆశిస్తున్నట్లు లావ్రోవ్ చెప్పారు. యుక్రెయిన్‌ లాంటి సోవియెట్ దేశాల్లోకి నాటో విస్తరించకూడదని డిమాండ్ చేశారు. రష్యా ఉక్రెయిన్ ఆక్రమిస్తే అమెరికా మిత్ర దేశాల నుంచి సత్వర, ఐక్యమైన స్పందన చూడాల్సి వస్తుందని బ్లింకెన్ చెప్పారు.

ఈ సమావేశం తర్వాత ఈ అంశం పై కొంత పురోగతి సాధించినట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి.

పుతిన్

యుక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా సుమారు 100,000 మంది సైనికులను మెహరించిన తర్వాత కూడా ఆ దేశం పై దాడి చేసే ప్రణాళికలు లేవని లావ్రోవ్ చెప్పారు.

యూరోపియన్ దేశాలన్నిటినీ నాటోలోకి ఆహ్వానించే ఓపెన్ డోర్ విధానాన్ని సమర్ధిస్తున్నట్లు బ్లింకెన్ చెప్పారు. రష్యా ఆందోళనలకు ఈ వారంలో రాతపూర్వకంగా సమాధానం చెబుతామని బ్లింకెన్ చెప్పారు.

యుక్రెయిన్‌కు మద్దతు తెలిపేందుకు అమెరికా తన సైన్యాన్ని ఉపయోగిస్తుందా అనే ప్రశ్నకు, అమెరికా నాటో మిత్ర దేశాలను సంరక్షించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు.

కానీ, యుక్రెయిన్‌ నాటో సభ్య దేశం కాదు. ఈ విషయం యుక్రెయిన్‌ అధికారులకు కూడా తెలుసు.

ఇరు పక్షాలు చర్చలను కొనసాగించేందుకు అంగీకరించాయి. బైడెన్, పుతిన్ మధ్య భవిష్యత్తులో సమావేశం జరగవచ్చనే అవకాశానికి మార్గాన్ని తెరిచారు.

కానీ, ఈ సమస్య ఎలా పరిష్కారం అయిందనే విషయాన్ని పక్కన పెడితే, ఈ సమావేశం చోటు చేసుకోవడంతో రష్యా కొంత వరకు విజయం సాధించినట్లే చెప్పవచ్చు.

రష్యా కదలికలు అమెరికా మిత్ర దేశాలు వేగంగా ముందుకు కదిలేందుకు ప్రోద్భలం కలిగించాయి. మరో వైపు అమెరికా వేగంగా పెరుగుతున్న చైనాతో పోటీ పడేందుకు దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.

కానీ, జెనీవాలో జరిగిన సమావేశాలు కొన్ని దశాబ్ధాల వెనక్కి తీసుకుని వెళ్ళింది. రష్యా ఆ క్షణానికి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

వాగ్ధానాలు నిలబెట్టుకోలేని రష్యా చరిత్రను బట్టీ, రష్యా ప్రచ్ఛన్న యుద్ధ సమయానికి తిరిగి వెళుతుందేమోనని అనిపిస్తోందని బ్లింకెన్ అన్నారు. "తిరిగి అలా జరగకూడదని భావిస్తున్నాను" అని అన్నారు.

కానీ, పుతిన్ అదే పరిస్థితిని తిరిగి తేవాలని భావిస్తున్నట్లైతే, యూరోప్ లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శాంతిని, స్వతంత్రం, మానవ జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు గతంలో మిత్ర దేశాలు ప్రదర్శించిన ఐక్యతను చూడాల్సి వస్తుంది" అని అన్నారు.

ఈ మూడు రోజుల్లో జరిగిన దౌత్య సమావేశాల తర్వాత ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయా లేదా అనేది చెప్పడం కష్టం.

కానీ, ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కానీ, ఫలితాలు లేని చర్చలు ముందుకు సాగవు.

అమెరికా రాత పూర్వకంగా ఇచ్చే వివరణ బట్టీ రష్యా యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో తన ప్రణాళికలను రచించుకోవచ్చు. యుక్రెయిన్‌లో సైబర్ యుద్ధాలు, సరిహద్దుల్లో మూడు వైపుల నుంచి కొన్ని వేల మంది రష్యా సేనల మెహరింపు , పారా సైనికులు యివ్ లో అడుగుపెడతారా లేదా అనే విషయాలను మాత్రం అమెరికా రాయబారులు ఊహించలేకపొతున్నారు.

ఏదైనా జరగవచ్చని భావిస్తున్నారు.

వసంత కాలం వర్షాలు పడితే, ట్యాంకులు ఆక్రమించడం సాధ్యం కాకుండా చూసేందుకు రష్యాను చర్చలు కొనసాగించేలా చూడాలని అమెరికా దృఢ నిశ్చయంతో ఉన్నట్లుగా ఉంది. అయితే, బైడెన్, బ్లింకెన్ కూడా తమ నిర్ణయాల పట్ల స్థిరాభిప్రాయంతోనే ఉన్నారు. అయితే, ఇది పుతిన్ మనసులో ఏమి జరుగుతోందనే విషయం పై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Ukraine, Russia: The result of hasty diplomatic efforts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X