వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్: రసాయన ఆయుధాలు అంటే ఏంటి... రష్యా వాటిని ప్రయోగిస్తుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రసాయన ఆయుధాలు

జీవ ఆయుధాలు తయారు చేసేందుకు యుక్రెయిన్ ప్రయత్నిస్తోందని ఆరోపించిన రష్యా తమ వాదన గురించి చర్చించేందుకు శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రత్యేక అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

యుక్రెయిన్, అమెరికా వీటిని తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేశాయి. యుక్రెయిన్‌లోని నగరాలపై రసాయన ఆయుధాలు ఉపయోగించడాన్ని సమర్థించుకునే ఉద్దేశంతోనే రష్యా ఈ వాదన వినిపిస్తోందని అన్నాయి.

యుక్రెయిన్‌కు చట్టబద్ధమైన లాబరేటరీలు ఉన్నాయి. కోవిడ్ లాంటి వ్యాధుల నుంచి జనాభాను కాపాడేందుకు అక్కడ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తుంటారని ఆ ప్రభుత్వం చెబుతోంది.

ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుడడంతో ఆ దేశంలోని ప్రయోగశాలల్లో అలాంటి ప్రమాదకరమైన వ్యాధికారకాలు ఏవైనా ఉంటే నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ యుక్రెయిన్‌కు సూచించింది.

అయితే, అసలు రసాయన ఆయుధాలు అంటే ఏంటి, అవి జీవ ఆయుధాలకంటే భిన్నంగా ఉంటాయా.

రసాయన ఆయుధాలు

రసాయన ఆయుధాలంటే...

శరీర వ్యవస్థపై దాడి చేసే రసాయన పదార్థాలు లేదా విష పదార్థాలను మోసుకెళ్లే ఆయుధాలను రసాయన ఆయుధాలు అంటారు.

రసాయన ఆయుధాల్లో రకరకాల కేటగిరీలు ఉంటాయి. ఫాస్జీన్(phosgene) లాంటి ఊపిరాడకుండా చేసే పదార్థాలు మనుషుల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తాయి. దానివల్ల బాధితుల శరీరం లోపల ఊపిరితిత్తుల స్రావాలు నిండిపోతాయి.

మస్టర్డ్ గ్యాస్ లాంటి కొన్ని పొక్కులు వచ్చేలా చేసే పదార్థాలు ఉంటాయి. వాటివల్ల చర్మం కాలడం, చూపు పోవడం జరుగుతుంది.

వీటన్నిటికంటే ప్రాణాంతకమైనవి నెర్వ్ ఏజెంట్స్. అవి శరీరంలోని కండరాలకు మెదడు పంపే సందేశాలను అడ్డుకుంటాయి. వీటి చిన్న బిందువు కూడా ప్రాణాంతకం అవుతుంది. ఉదాహరణకు 0.5 మిల్లీ గ్రాము వీఎక్స్ నెర్వ్ ఏజెంట్ ఒక వ్యక్తి ప్రాణాలు తీయగలదు.

యుద్ధం జరిగే సమయంలో ఫిరంగి గుండ్లు, బాంబులు, క్షిపణుల్లో ఈ రసాయన పదార్థాలను నింపి ప్రయోగించవచ్చు.

కానీ, 1997లో రసాయన ఆయుధాల నిషేధంపై జరిగిన సమావేశంలో ఈ అన్ని రసాయనాలపై నిషేధం విధించారు. రష్యాతో సహా చాలా దేశాలు ఈ సమావేశంలో సంతకాలు చేశాయి.

రసాయన ఆయుధాల వినియోగంపై నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న 'ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్'(ఓపీసీడబ్ల్యు) నిఘా పెట్టింది.

చట్టవిరుద్ధంగా రసాయన ఆయుధాలు ఉపయోగించడాన్ని ఇది పరిశీలిస్తుంటుంది, ఆ చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.

వీటిని ఇప్పటివరకూ మొదటి ప్రపంచ యుద్ధంలో, 1980లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో, ఇటీవల తిరుగుబాటు దళాలపై సిరియా ప్రభుత్వం ఉపయోగించారు.

తమ చివరి రసాయన ఆయుధ నిల్వలను 2017లో ధ్వంసం చేశామని రష్యా చెబుతోంది. కానీ, ఆ తర్వాత అది రెండు రసాయన దాడులకు పాల్పడినట్లు రష్యా మీద ఆరోపణలున్నాయి.

రసాయన ఆయుధాలు

రెడ్ లైన్ దాటినట్లే

వీటిలో మొదటిది 2018 మార్చిలో జరిగిన శాలిస్‌బరీ దాడి. ఇందులో మాజీ కేజీబీ అధికారి, ఫిరాయింపుదారుడైన సెర్గే స్క్రీపాల్, ఆయన కూతురిపై నోవిచోక్ అనే నెర్వ్ ఏజెంట్‌తో విషప్రయోగం చేశారు.

ఇందులో తమ హస్తం లేదని రష్యా చెప్పింది. అయితే, అది ఎవరు చేసుండవచ్చు అనేదానిపై అది 20 రకాలకు పైగా వివరణలు ఇచ్చింది.

కానీ, అది రష్యా జీఆర్‌యూ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఇద్దరు అధికారుల పనేనని అధికారులు నిర్ధరించారు.

ఫలితంగా వివిధ దేశాలు తమ దేశం నుంచి 128 మంది రష్యా గూఢచారులు, దౌత్యవేత్తలను బహిష్కరించాయి.

2020 ఆగస్టులో ప్రముఖ రష్యా విపక్ష కార్యకర్త అలెక్సీ నావల్నీ మీద కూడా నోవిచోక్‌తో విషప్రయోగం చేశారు. కానీ, ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

రష్యా రసాయన ఆయుధాలు వాడుతుందా

రష్యా ఈ యుద్ధంలో విషపూరిత వాయువులు వాడితే, దానిని హద్దు మీరడంగానే చూస్తారు. అది బహుశా పశ్చిమ దేశాలు నిర్ణయాత్మక చర్యలు తీసుకునేలా కూడా ప్రేరేపించవచ్చు.

సిరియాలో తిరుగుబాటుదారులను ఓడించడానికి తన మిత్ర దేశానికి సాయం చేస్తున్న సమయంలో రష్యా ఈ ఆయుధాలను ఉపయోగించిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

కానీ, తన సొంత ప్రజలపై పదుల సార్లు రసాయన దాడులు చేశారనే ఆరోపణలు ఎదుర్కున్న బషర్ అల్ అసద్‌కు రష్యా భారీ మిలిటరీ సపోర్ట్ అందించింది.

వాస్తవానికి, మనం ఒక సుదీర్ఘ యుద్ధంలో పోరాడుతుంటే, అక్కడ ప్రత్యర్థి దళాలు మన రక్షణ బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటే.. అలాంటి సమయంలో దురదృష్టవశాత్తూ రసాయన ఆయుధాలు సమర్థంగా ఉపయోగపడతాయి. అలెప్పోలో సిరియా చేసింది అదే.

మరోవైపు, జీవ ఆయుధాలు అనేవి రసాయన ఆయుధాలకు భిన్నంగా ఉంటాయి. ఈ ఆయుధాలను ఎబోలా లాంటి ప్రమాదకరమైన వ్యాధి కారకాలతో తయారు చేస్తారు.

ఇక్కడ సమస్య ఏంటంటే జనాభాను హానికరమైన వ్యాధికారకాల నుంచి రక్షించుకోడానికి ప్రయోగాలు చేయడం, వాటినే ఒక ఆయుధంలా ఎలా ఉపయోగించవచ్చు అని రహస్యంగా ప్రయోగాలు చేయడం మధ్య ఒక గ్రే ఏరియా ఉంటుంది.

యుక్రెయిన్ అలాంటి ఆయుధాలపై ప్రయోగాలు చేస్తోందని రష్యా ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆధారాలను అదించలేదు.

జీవాయధాలు ఎంత ప్రమాదకరం

కానీ, అది తమ వాదనపై చర్చించడానికి ఒక అత్యవసర భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చింది.

రష్యా సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు బయోప్రిపరట్ అనే ఏజెన్సీ ద్వారా భారీ ఎత్తున జీవాయుధాల కార్యక్రమాన్ని నియంత్రించేది. దానికోసం అది దాదాపు 70 వేల మందిని కూడా నియమించుకుంది.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత, శాస్త్రవేత్తలు దానిని నాశనం చేందుకు వెళ్లారు. సోవియట్‌లో భాగంగా ఉన్న దక్షిణ రష్యాలోని ఒక దీవిలో ఆంత్రాక్స్, స్మాల్‌పాక్స్, ఇతర వ్యాధికారకాల జీవాయుధాలను బతికున్న కోతులపై పరీక్షించాక, వాటిని భారీగా ఉత్పత్తి చేసినట్లు వారు గుర్తించారు.

అక్కడ పశ్చిమ దేశాల నగరాలు లక్ష్యంగా సిద్ధం చేసిన ఖండాంతర క్షిపణుల వార్ హెడ్లలో ఆంత్రాక్స్ బీజాంశాలను కూడా నింపి ఉండడం వారికి కనిపించింది.

రసాయన ఆయుధాలు

డర్టీ బాంబ్

చివరగా ఈ సంప్రదాయేతర ఆయుధాల జాబితాలో ఒక 'డర్టీ బాంబ్' కూడా ఉంది. అది రేడియో ధార్మిక మూలకాలు చుట్టూ ఉన్న ఒక మామూలు పేలుడు పదార్థంలా ఉంటుంది. దానినే రేడియాలాజికల్ డిస్పెర్సల్ డివైస్(RDD) అంటారు.

ఇది సీజియం 60 లేదా స్ట్రాన్షియం 90 లాంటి రేడియోయాక్టివ్ ఐసోటోప్‌లు తీసుకెళ్లే ఒక సంప్రదాయ పేలుడు పదార్థం కావచ్చు.

ఈ డర్టీ బాంబ్ మామూలు బాంబు కంటే ఎక్కువమందిని చంపాలనేం లేదు. కానీ దాని ప్రభావం భారీగా ఉంటుంది. చెప్పాలంటే, దానిని పూర్తిగా ప్రక్షాళన చేసేలోపు దాదాపు లండన్ బరో అంత ప్రాంతాన్ని అది కొన్ని వారాల్లో నివసించలేని విధంగా మార్చేస్తుంది.

డర్టీ బాంబ్ అనేది దాదాపు ఒక మానసిక ఆయుధం లాంటిది. దానిని ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడానికి, సమాజం మనోబలం దెబ్బతీయడానికి రూపొందించారు.

దీనిని యుద్ధంలో పెద్దగా ఉపయోగించడం మనం చూడలేదు. ఎందుకంటే ఆ బాంబ్‌ను హాండిల్ చేయడం కష్టం, ప్రమాదకరం కూడా. అది స్వయంగా దానిని ప్రయోగించేవారిని కూడా ప్రమాదంలో పడేయగలదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ukraine: What are chemical weapons will Russia use them?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X