ప్రజాగ్రహం: ఆ ఎంపీని చెత్తకుండీలో పడేశారు(ఫొటో)
కీవ్: ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఓ పార్లమెంటుసభ్యుడ్ని ప్రజలు ఎత్తుకెళ్లి చెత్తకుండీలో పడేశారు. ఈ ఘటన ఉక్రెయిన్ దేశంలో చోటు చేసుకుంది. ఆ దేశంలోని విటలీ జురవ్‌స్కీ అనే ఎంపికి ప్రజలు ఈ రకమైన సన్మానం చేశారు. అది కూడా పార్లమెంటు ఎదుటే కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి అధ్యక్ష పదవి కోల్పోయిన విక్టోర్ యానుకోవిచ్‌కు అత్యంత సన్నిహితుడు జురవ్‌స్కీ. దీంతో ఆయన మీద ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా అతడ్ని ఎత్తుకెళ్లి సమీపంలోని చెత్తకుండీలో పడేశారు.

ఆయన లేవబోతుంటే మళ్లీ మళ్లీ లోపలకు తోసేశారు. అక్కడికి చేరుకున్న భద్రత సిబ్బంది, అధికారులు ప్రజలను చెదరగొట్టి.. జురవ్‌స్కీని చెత్తకుండీలోనుంచి బయటికి తీశారు. ప్రజాగ్రహాన్ని చవిచూసిన జురవ్‌స్కీ తన ఎంపి పదవికీ రాజీనామా చేసినట్లు తెలిసింది.
విక్టోర్ యనుకోవిచ్ అవినీతి పాలనలో భాగస్వామిగా ఉన్నందుకు ఎంపి జురవ్‌స్కీ ప్రజలు తమ ఆగ్రహాన్ని చెత్తకుండీలో పడేసి చూపించారు. ఇలాంటి ఘటనే 10 రోజుల క్రితం దక్షిణ ఒడెస్సా నగరంలో చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications