ఉక్రెయిన్ కు ఆయుధాలు.. ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. రష్యా ఖేల్ ఖతం

గత ముడేళ్లుగా ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర పోరు జరగని రోజంటూ లేదు. ఉక్రెయిన్ ఆదాయం పరంగా, వాణిజ్యం పరంగా చిన్న దేశమైనప్పటికీ రష్యా లాంటి అతిపెద్ద దేశంతో యుద్ధాన్ని నెట్టుకుంటూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం అమెరికానే. అగ్రరాజ్యమే అన్నీ తానై ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ రష్యాను నిలువరిస్తోంది. ఉక్రెయిన్ వద్ద ఉన్న ఆయుధాలలో దాదాపు 40శాతం అమెరికా ఇచ్చినవే. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే 2022 నుంచి ఇప్పటివరకూ దాదాపు రూ. 5లక్షల కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సామాగ్రిని అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తూ ఉక్రెయిన్ కు చేరవేసింది. ఉక్రెయిన్ కు మరో 500 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించేందుకు అగ్రరాజ్యం సిద్ధంగా ఉందని గతంలో బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

రుబియో సంచలన ప్రకటన ఇటీవల యూఎస్ సెక్రటరీ జనరల్ మార్కో రుబియో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు 90 రోజులపాటు అన్ని రకాల సాయాలను ఆపేస్తూ అమెరికా నిర్ణయం తీసుకుందని సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం చేయాలో పాలుపోక ట్రంప్ తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మాట్లాడుతూ.. తమ దేశానికి అమెరికా సైనిక సహాయాన్ని ఆపలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. కష్ట కాలంలో ఉన్న తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. రుబియో తీసుకున్న నిర్ణయంతో తాను ఆందోళనకు గురయ్యానని.. కానీ, భగవంతుడి దయ వల్ల మాకు ఆయుధాల సరఫరాను అగ్రరాజ్యం ఆపలేదు" అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

Ukrainian President Zelensky announced that the United States has not stopped military aid to his country

నేనైతే యుద్ధాన్ని ఆపేవాడ్ని..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని అన్నారని జెలెన్ స్కీ గుర్తుచేశారు. ట్రంప్ గతంలోనూ పలుసార్లు ఇదే చెప్పారని.. తాను అధ్యక్షుడిగా ఉంటే అసలు ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభం కాకుండా ఆపేవాడినని చెప్పేవారని జెలెన్ స్కీ అన్నారు. త్వరలో దీనికి ముగింపు పలుకుతానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

ఇజ్రాయెల్‌కు బంకర్ బాంబులు

మరోవైపు ఇజ్రాయెల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను సరఫరా చేసేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. గతంలో బైడెన్ సర్కార్ వీటి సరఫరాకు అడ్డుకట్టవేసింది. అయితే తాజాగా ట్రంప్ బైడెన్ నిర్ణయాన్ని రద్దుచేశారు. దీంతో 1,800 ఎంకే-84 బాంబులను ఇజ్రాయెల్‌కు సరఫరా చేసేందుకు మార్గం సుగమం అయింది. వీటిని బంకర్‌ బస్టర్ బాంబులు అని పిలుస్తారు. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుంటుంది. ఈ దాడుల కోసం 2,000 పౌండ్ల బరువున్న బాంబులను వినియోగిస్తే భారీ విధ్వంసం జరుగుతుంది. ఇంతగా విధ్వంసం జరగకూడదనే సదుద్దేశంతో గత బైడెన్‌ సర్కారు ఇజ్రాయెల్‌కు ఈ బాంబుల సరఫరాను ఆపేసింది. కానీ ట్రంప్ మాత్రం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ పచ్చజెండా ఊపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+