వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిషేధం ఉన్న ఉ.కొరియా నుండి ఇండియాకు ఎగుమతులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: 270 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఉత్తరకొరియా ఎగుమతి చేసినట్టు ఐక్యరాజ్యసమితి శనివారం నాడు ప్రకటించింది. అయితే చైనాతో పాటు ఇండియా, మలేషియా, శ్రీలంక దేశాలకు ఉత్తరకొరియా ఈ వస్తువులను ఎగుమతి చేసిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న వైఖరిపై ప్రపంచదేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అణుపరీక్షలు, క్షిపణుల పరీక్షలను వద్దని వ్యతిరేకించినా కానీ, అతనిలో మార్పు రాలేదు.

దీంతో ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి పలు ఆంక్షలను విధించింది. ఆరు మాసాల క్రితం ఈ ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా పలు దేశాలకు తమ వస్తువులను ఎగుమతి చేసిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

 UN experts: NKorea exported USD 270 million illegally recently

నిషేధం ఉన్నా ఈ వ్యాపారం కొనసాగడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది. బొగ్గు, ఇనుముతో పాటు ఇతర వస్తువులను ఉత్తరకొరియా ఎగుమతి చేసిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

చైనా, భారత్, మలేషియా, శ్రీలంకకు ఆరు మాసాలుగా ఉత్తరకొరియా ఈ వస్తువులను ఎగుమతి చేసిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

ప్రపంచదేశాలకు వణుకు పుట్టిస్తున్న ఉత్తరకొరియాపై ఆయుధ, ఆర్థిక, రవాణ పరమైన ఆంక్షలున్నాయి. అయితే నిషేధాన్ని ఉల్లంఘించి అణు శక్తి రంగానికి సంబంధించిన అంశాల జోలికి కూడ ఉత్తరకొరియా వెళ్తుతున్నట్టు యూఎస్ ధృవీకరించింది. ఆఫ్రికా, సిరియాల్లో నిషేధిత కార్య కలాపాల్లో ఉత్తరకొరియా పాల్గొంటుందా అనే లేదా అనే విషయమై విచారణ సాగిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

English summary
UN experts say North Korea illegally exported coal, iron and other commodities worth at least USD 270 million to China and other countries including India, Malaysia and Sri Lanka during the six-month period ending in August in violation of UN sanctions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X