• search

ఐరాస కఠిన ఆంక్షలు, అయినా తగ్గని ఉత్తరకొరియా, అమెరికా అంతు చూస్తామని హెచ్చరిక

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  జెనీవా: ఉత్తరకొరియా ఆగడాలను అడ్డుకునేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలటూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐరాస భద్రత మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

  ఉత్తరకొరియా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధించడమేకాక, ఆ దేశం నుంచి వస్త్రాల ఎగుమతిపై కూడా నిషేధం విధించింది. ఉత్తర కొరియా ఇంధన దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించాలని అమెరికా కోరినప్పటికీ.. మండలిలోని రష్యా, చైనా మాత్రం దిగుమతులను తగ్గించాలని ఓటు వేశాయి.

  భద్రతామండలిలో అమెరికా తీర్మానం...

  భద్రతామండలిలో అమెరికా తీర్మానం...

  ఉత్తరకొరియా హైడ్రోజన్‌ బాంబును విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగంపై అమెరికా సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధించాలని అమెరికా ఐరాసను కోరింది. ఈ మేరకు భద్రతామండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

  ఆపకపోతే.. ఆపిస్తాం: నిక్కీ హేలీ

  ఆపకపోతే.. ఆపిస్తాం: నిక్కీ హేలీ

  ‘అణ్వాయుధాలు కలిగిన ఉత్తరకొరియాను ప్రపంచం ఎప్పటికీ అంగీకరించదు. ఇప్పటికైనా ఆ దేశ పాలకులు అణు ప్రయోగాలను ఆపకపోతే.. ఆపించాల్సి వస్తుందని భద్రతామండలి స్పష్టం చేసింది' అని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తెలిపారు. ఇటీవల

  అమెరికా అలా.. రష్యా, చైనా ఇలా..

  అమెరికా అలా.. రష్యా, చైనా ఇలా..

  ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానంపై సోమవారం ఓటింగ్‌ జరిగింది. అయితే ఉత్తర కొరియా ఇంధన దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించాలని అమెరికా కోరినప్పటికీ.. మండలిలోని రష్యా, చైనా మాత్రం దిగుమతులను తగ్గించాలని ఓటు వేశాయి. దీంతో ప్రస్తుతం ఉత్తర కొరియా దిగుమతి చేసుకుంటున్న ఇంధనంలో 30 శాతం వరకూ కోత విధించారు. గ్యాస్‌, డీజిల్‌, హెవీ ఫ్యూయల్‌ ఆయిల్‌ దిగుమతులపై 55 శాతం కోత విధించడమేగాక.. సహజ వాయువు, ఆయిల్‌ ఉప ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ.. తీర్మానానికి ఆమోద ముద్ర వేసింది.

  ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకే...

  ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకే...

  ఉత్తర కొరియాపై తాజాగా ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి విధించిన కఠిన ఆంక్షల ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కఠిన ఆంక్షల్లో భాగంగా ఉత్తరకొరియా వస్త్రాల ఎగుమతులపై నిషేధం తీసుకొచ్చారు. ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థకు ఈ వస్త్రాల ఎగుమతులే అత్యంత కీలకం. ఈ ఎగుమతుల ద్వారా గడిచిన మూడేళ్లలో ఉత్తరకొరియా 760 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ఇప్పుడు వస్త్రాల ఎగుమతులపై ఆంక్షలు విధించడం ఉత్తర కొరియాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

  అయినా వెనక్కి తగ్గని ఉత్తరకొరియా...

  అయినా వెనక్కి తగ్గని ఉత్తరకొరియా...

  తమపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కఠిన ఆంక్షలు విధించడాన్ని నార్త్‌ కొరియా తోసిపుచ్చింది. అమెరికా కనీవినీ ఎరుగని రీతిలో భారీ మూల్యం చెల్లించుకుంటుందని తీవ్రంగా హెచ్చరించింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లను ధిక్కరించి ఉత్తర కొరియా తాజాగా అణు పరీక్షలకు దిగడంతో ఐరాస భద్రతా మండలి ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

  అమెరికాకు బుద్ధి చెప్పి తీరుతాం...

  అమెరికాకు బుద్ధి చెప్పి తీరుతాం...

  తమపై ఆంక్షలు విధిస్తూ ఐరాస తీర్మానాన్ని తమ ప్రతినిధి బృందం తీవ్రంగా ఖండించిం‍దని, భధ్రతా మండలి చేసిన అక్రమ, చట్టవిరుద్ధ తీర్మానాన్ని తిరస్కరించిందని ఉత్తర కొరియా ఐరాస రాయబారి హన్‌ టెసాంగ్‌ స్పష్టం చేశారు. అమెరికా తమకు వ్యతిరేకంగా రాజకీయ, ఆర్థిక, సైనిక వివాదాలకు దిగుతున్నదని విమర్శించారు. అమెరికాకు బుద్ధి చెప్పేలా తీవ్ర చర్యలకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. తామిచ్చే సందేశం అమెరికా చరిత్రలో ఎన్నడూ ఎదురుకాని అనుభవాన్ని చవిచూస్తుందన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The United Nations Security Council unanimously adopted a US-drafted resolution to impose new sanctions on North Korea on Monday -- a move that comes just one week after the rogue nation carried out its sixth and largest nuclear test. The resolution is designed to accomplish six major goals: cap North Korea's oil imports, ban textile exports, end additional overseas laborer contracts, suppress smuggling efforts, stop joint ventures with other nations and sanction designated North Korean government entities, according to a US official familiar with negotiations. "Today, we are saying the world will never accept a nuclear armed North Korea, and today the Security Council is saying that if the North Korean regime does not halt its nuclear program, we will act to stop it ourselves," US ambassador to the UN Nikki Haley said following the vote Monday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more