వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మవ్యూహంలో పుతిన్-ఉక్రెయిన్ నుంచి బయటపడేదెలా ? స్టాలిన్ తరహాలో పరాభవం తప్పదా!

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై దండయాత్రకు వెళ్లినంత సులువుగా దాన్ని ముగించడం సాధ్యం కాదని రష్యా అధినేత పుతిన్ ఊహించలేదు. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను ఓవైపు ఆంక్షలతో, మరోవైపు ఐరాసతో పాటు అంతర్జాతీయంగా ఒంటరి చేస్తూ పశ్చిమదేశాలు బిగిస్తున్న ఉచ్చుతో పుతిన్ ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. భారత్ వంటి చిరకాల మిత్ర దేశాలు తటస్ధ వైఖరి అవలంబిస్తున్నా అది ఏమాత్రం పనికిరావడం లేదు. దీంతో యుద్ధం నుంచి బయటపడేందుకు రోజుకో కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు.

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర

ప్రపంచ దేశాలు వారిస్తున్నా వినకుండా ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యాకు ఆరంభం నుంచే చుక్కలు కనిపిస్తున్నాయి. రష్యా యుద్ధ విమానాల్ని కూల్చేస్తూ, సైనికుల్ని చంపేస్తూ ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటన వ్రదర్శిస్తున్నా దాన్ని అంగీకరించకుండా తమదే పైచేయి అని చెప్పుకుంటూ వచ్చిన పుతిన్.. ఇప్పుడు ఆ మాట మాట్లాడేందుకు సాహసించడం లేదు. దీనికి ప్రధాన కారణం యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలు కావస్తున్నా ఇప్పటికీ ఉక్రెయిన్ పై పట్టు సంపాదించలేకపోవడమే. స్వదేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు చూపిస్తున్న తెగువ అంతకుమించి పుతిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

భీకర ఎదురుదెబ్బలు

భీకర ఎదురుదెబ్బలు

ఉక్రెయిన్ లో ప్రస్తుతం నిత్యం బాంబుల మోత మోగుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రులు, స్కూళ్లు, ప్రార్ధనామందిరాలు ఇలా వేటినీ వదలకుండా రష్యా బాంబులు వేస్తోంది. యుద్ధఁలో కనీస మానవత్వం ప్రదర్శించడం లేదు. ఇదంతా నాణేనికి ఓ వైపు అయితే.. మరోవైపు రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు వీరుల్లా ముందుకు కదులుతున్నారు.

ఉక్రెయిన్ ను రష్యా కైవసం చేసుకోకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయుధాలు చేపట్టి రష్యా సైనికులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఈ ప్రతిఘటనలో రష్యా భారీ నష్టాల్ని చవిచూస్తోంది. పది రోజులకు మించి మందుగుండు కూడా లేదని తేలిపోవడంతో రష్యా ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడిపోతోంది.

పద్మవ్యూహంలో పుతిన్

పద్మవ్యూహంలో పుతిన్

ఉక్రెయిన్ తో పోరులో తమ సైనికులకు తగులుతున్న ఎదురుదెబ్బలు, మందుగుండు ఖాళీ అవుతుండటం ఓ ఎత్తయితే ఇప్పుడు అంతర్జాతీయంగా రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలతో విరుచుకుపడుతున్న తీరు పుతిన్ కు చుక్కలు చూపిస్తోంది. రష్యా ఆర్ధిక వ్యవస్ధ కుదేలవుతోంది. స్టాక్ మార్కెట్లు నెలరోజులుగా నష్టాల్లోనే ఉన్నాయి. రష్యాపై ఆంక్షల ప్రభావం ఈ దశాబ్దమంతా కొనసాగేలా కనిపిస్తోంది. దీంతోపాటు స్వదేశంలో సైతం పుతిన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రష్యాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి పుతిన్ యుద్ధ పిపాసకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. దీంతో యుద్ధంలో పూర్తిగా మునిగిపోయిన పుతిన్ ఇప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లయింది.

 యుద్ధం నుంచి బయటపడేదెలా?

యుద్ధం నుంచి బయటపడేదెలా?

యుద్ధం మొదలుపెట్టినంత సులువు కాదు ముగించడం. పుతిన్ కు ఈ విషయం ఇప్పటికే బాగా అర్దమైంది. ఉక్రెయిన్ లో యుద్ధానికి వెళ్లిన రష్యా సేనలు.. ఒట్టి చేతులతో తిరిగి రావడం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. ఇక గౌరవ ప్రదంగా యుద్ధాన్ని ముగించామని అనిపించుకోవడం ఒక్కటే మిగిలుంది.

అలా కాకుండా అక్కడే ఉండి పోరాడుతున్నట్లు ఎన్నిరోజులు నటించినా అది రష్యాకు నష్టమే తప్ప ఏవిధంగానూ మేలు చేకూర్చే అవకాశం లేదు. దీంతో రష్యా అధినేత పుతిన్ ఇప్పుడు చర్చల కోసం పట్టుబడుతున్నారు. ఉక్రెయిన్ చర్చలకు రావడం లేదని వాపోతున్నారు. ప్రపంచ దేశాల జోక్యం కోరుతున్నారు. అయినా వారు స్పందించే పరిస్ధితి లేదు.

స్టాలిన్ తరహాలోనే పుతిన్ కు పరాభవం తప్పదా?

స్టాలిన్ తరహాలోనే పుతిన్ కు పరాభవం తప్పదా?

1940వ దశకంలో బల ప్రయోగంతో ఫిన్లాండ్ ను తమ దేశంలో కలిపేసుకోవాలని నాటి సోవియట్ యూనియన్ నేత జోసెఫ్ స్టాలిన్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఫిన్లాండ్ ప్రజలు ఇప్పుడు ఉక్రెయిన్ తరహాలోనే ఎదురుదిరిగారు. పెట్రోల్ బాంబులతో పాటు ఇతర ఆయుధాలతో స్టాలిన్ సేనల్ని దీటుగా అడ్డుకున్నారు. దంతో పరాభవం తప్పదని తెలిసి స్టాలిన్ బలగాలు అప్పట్లో వెనుదిరిగాయి. ఇప్పుడు సరిగ్గా పుతిన్ కూ అలాంటి పరిస్ధితే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్ చర్చలకు ముందుకు రాకుండా మరికొన్నాళ్లు ఓపికపడితే మాత్రం పుతిన్ కు స్టాలిన్ గతి పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
After severe pressure from all sides now russian president vladimir putin is searching ways to conclude the war in ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X