భారత్ ఊహకందని విధంగా బదులిస్తాం: అసిమ్ మునీర్ సంచలనం
ఏప్రిల్ 22, 2025.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఉగ్రమూకను భారత టూరిస్టులపై ఉసిగొల్పిన పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వందల మంది టెర్రరిస్టులను హతమార్చింది. అయితే ఆనాటి నుండి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. భారత్ పై నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ వచ్చారు. తాజాగా మరోసారి భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటోందని.. భారత్ భౌగోళిక భద్రతను దెబ్బ తీయగలమని తెలిపారు. ఈ న్యూక్లియర్ వాతావరణంలో భారత్ జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఈ ఏడాది మే లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో తామే విజయం సాధించామని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి నోటికొచ్చినట్లు మాట్లాడారు. పాకిస్థాన్ కు చైనా, అమెరికా అండదండలు ఉన్నాయన్నారు. ఈ మేరకు అసిమ్ మునీర్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాబుల్ లోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ లో అక్టోబర్ 18 న జరిగిన సమావేశంలో భారత్ కు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్.. తన మిలిటరీ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటోందని అన్నారు. భవిష్యత్తులో ఏ విధమైన దాడులకు పాల్పడినా.. భారత్ ఊహకందని విధంగా మిలిటరీ, ఆర్థిక వ్యవస్థపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం తర్వాతి పరిణామాలు భారత్ మోయాల్సి ఉంటుందన్నారు.
న్యూక్లియర్ వాతావరణంలో యుద్ధానికి చోటు లేదని.. సరిహద్దుల్లో బలగాల మోహరింపునకు భారత్ ఒప్పుకోకపోవడంపై ప్రశ్నించారు. ఈ మేరకు మే లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరును ప్రస్తావించకుండానే.. మే లో జరిగిన యుద్ధంలో తాము గెలిచామని చెప్పుకొచ్చారు అసిమ్ మునీర్. ఓ వైపు అఫ్గానిస్తాన్ తాలిబాన్ల నుంచి మరోవైపు దేశ ప్రజల నుంచి దాడులు నమోదవుతున్న నేపథ్యంలో అసిమ్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాకిస్థాన్ ను అస్థిరత పరిచే దేశాలపై ఊహించని విధంగా దాడులు చేసి వారి ఆర్థిక వ్యవస్థను.. మిలిటరీ వ్యవస్థను దెబ్బతీస్తామని భారత్ ను పరోక్షంగా హెచ్చరించారు.

పాకిస్థాన్ ను రెచ్చగొట్టే విధంగా భారత్ చిన్న కార్యక్రమానికి పాల్పడినా తాము తక్షణమే స్పందిస్తామని అసిమ్ మునీర్ తెలిపారు. దాడుల తర్వాత ఆ పరిణామాలను భారత్ భరించాల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాక పాకిస్థాన్ తో అమెరికా, చైనా, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు చైనాతో తమకు జరిగిన ఒప్పందాన్ని ప్రస్తావించారు. అలాగే ఘర్షణలు చెలరేగిన దేశాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతిని నెలకొల్పుతున్నారని ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు అసిమ్ మునీర్. ట్రంప్ ది వ్యూహాత్మక నాయకత్వం అని అన్నారు.
🚨 Breaking 🇵🇰🪖
— OsintTV 📺 (@OsintTV) October 18, 2025
Failed Marshal Asim Munir Issues Nuclear and Economic Threats to India.
Should a fresh wave of hostilities be triggered, Pakistan would respond much beyond the expectations of the initiators. The resulting retributive military and economic losses inflicted will… pic.twitter.com/2IHveD16ox
ఇక అసిమ్ మునీర్ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లోయలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జులై 29 న కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా ఈ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications