రేపే కుల్‌భూషన్ జాదవ్‌కు కాన్సులేట్ యాక్సెస్... నిబంధనలతో కూడిన యాక్సెస్‌ను అంగీకరించమన్న భారత్
ఇండియన్ మాజీ నేవీ కమాండర్ కుల్‌భూషన్ జాదవ్ కేసుకు సంబంధించి పాకిస్థాన్ ఎలాంటి నిబంధనలు లేని ఫ్రీ అక్సెస్ కావాలని భారత్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే గత కొద్ది రోజులుగా పాకిస్థాన్,భారత దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తల నడుమ ఇండియన్ మాజీ నేవీ కమాండర్ కుల్‌భూషన్ జాదవ్ కేసుకు సంబంధించి కాన్సులర్ అక్సెన్ అందించేందుకు పాకిస్థాన్ ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలోనే సెప్టెంబర్ 2న ఆయన్ను కలిసేందుకు అవకాశం ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని గత నెల రోజుల క్రితమే ప్రకటించింది. అనంతరం భారత దేశ సమాధానం కోసం వేచి చూసింది.

మాజీ నేవీ కమాండర్ కుల్‌భూషన్ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం పున:పరీశిలించాలని కోరడంతోపాటు ఆయనకు విధించిన ఉరిశిక్షను సైతం రద్దు చేసింది. దీంతో పాటు ఆయనకు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని కూడ ఆదేశించింది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో దిగివచ్చిన పాకిస్థాన్ కాన్సులర్ యాక్సెన్ ను ఇంచేందుకు అంగీకరించింది. అయితే కూడ నిబంధనలతో కూడుకున్న కాన్సులర్ మాత్రమే అంగీకరించింది. ఈ నేపధ్యంలోనే సెప్టెంబర్ 2న అవకాశం ఇస్తున్నట్టు పాకిస్థాన్ తెలిపింది.
అయితే భారత్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు, ఎలాంటీ నిబంధనలు లేకుండానే కాన్సులర్ ను అనుమతించాలని కోరుతోంది. ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. అయితే ఒప్పందాల ప్రకారమే కాన్సులర్ అనుమతి ఇస్తున్నట్టు పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధులు ట్విట్టర్‌లో మరోసారి సమాచారం అందించారు. తమ భూభాగంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కుల్ భూషణ్ ను 2017లో అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్ బలగాలు మరణ శిక్ష విధించారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications