వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Scary Video: 14 వేల అడుగుల ఎత్తులో విమానం ఇంజిన్‌లో మంటలు: చెల్లా చెదురుగా జనావాసాలపై

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో భయానక సంఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 777 విమానం ప్రమాదానాకి గురైంది. టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఒక వైపు ఇంజిన్ మొత్తం తగులబడిపోయింది. దాని విడి భాగాలన్నీ చెల్లాచెదురుగా జనావాసాలపై పడ్డాయి. పైలెట్ సకాలంలో స్పందించారు. విమానాన్ని వెనక్కి మళ్లించారు. సురక్షితంగా దాన్ని ల్యాండ్ చేశారు. ఫలితంగా- తృటిలో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పిందని, ఎవరికీ గాయాలు కాలేదని విమానయాన సంస్థ తెలిపింది.

టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాల్లోపే..

అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం UA 328 (United Boeing 777) హొనొలులుకు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 241 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాల తరువాత విమానం కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. తొలుత తెల్లటి పొగ వెలువడింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి.

జనావాసాలపై చెల్లాచెదురుగా

అప్పటికే విమానం 13,500 నుంచి 14,000 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. అగ్ని కీలల బారిన పడి ఇంజిన్ విడి భాగాలన్నీ చెల్లాచెదురుగా జనావాసాల మీద పడ్డాయి. అనుకోని ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దం చేస్తూ ఇంజిన్ విడి భాగాలు తమ ఇళ్లపై పడటంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానం కుప్పకూలిపోతుందని భయపడ్డారు. పొగలు కక్కుకుంటూ వెళ్తోన్న విమానాన్ని స్థానికులు ఫొటోలు తీశారు. మంటలు చెలరేగిన విషయాన్ని గుర్తించిన వెంటనే పైలెట్లు అప్రమత్తం అయ్యారు. విమానాన్ని వెనక్కి మళ్లించారు. మళ్లీ డెన్వర్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. సేఫ్ ల్యాండింగ్ చేశారు.

United Airlines Boeing 777 suffers engine failure after takeoff from Denver

ఈ సమాచారం అందుకున్న వెంటనే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు అప్రమత్తం అయ్యారు. 14 వేల అడుగుల ఎత్తులో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగిన విషయంపై డెన్వర్ ఎయిర్‌పోర్ట్ అధికారులతో మాట్లాడారు. అగ్నిమాపక దళాలు, అంబులెన్స్‌లను విమానాశ్రయంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు ఎప్పటికప్పుడు పైలెట్లతో సంప్రదింపులు జరిపారు. అత్యవసర ల్యాండింగ్‌ను అనుమతి ఇచ్చారు. ల్యాండ్ అయిన వెంటనే మంటలను ఆర్పివేశారు.

English summary
A United Airlines Boeing 777-200 bound for Honolulu suffered an engine failure shortly after takeoff from Denver on Saturday, the Federal Aviation Administration said. The plane returned to Denver where it landed safely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X