US Election Results: భారత్ తో పోలిస్తే అమెరికాలో ఓట్ల లెక్కింపు ఆలస్యం ఎందుకో తెలుసా ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ కూ, డెమోక్రాట్ అభ్యర్ధి కమలా హ్యారిస్ కు మధ్య జరుగుతున్న ఈ భీకర పోరు ఫలితం రేపు, ఎల్లుండిలో తేలబోతోంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం మొదలైన పోలింగ్ రేపు ఉదయం వరకూ సాగనుంది.
అది పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. అయితే వివిధ కారణాల వల్ల భారత్ తో పోలిస్తే అమెరికా ఎన్నికల ఫలితాలు ఆలస్యమవుతుంటాయి. అవేంటో చూద్దాం..

భారత కాలమానం ప్రకారం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రేపు ఉదయం ముగియనుంది. అయితే ఓట్ల లెక్కింపుకు వచ్చే సరికి మాత్రం అమెరికాలో రాష్ట్రాల వారీగా పలు నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల విజేతను తేల్చే స్వింగ్ రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రత్యేక నిబంధనలు కౌంటింగ్ వేగంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. దీంతో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో సమయంలో వెల్లడవుతాయి.
భారత్ లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు వివిధ దశల్లో జరిగినా ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మాత్రం ఒకేసారి జరుగుతుంది. దీంతో ఫలితాలు కౌంటింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే విడుదలవుతాయి. కానీ అమెరికాలో మాత్రం పరిస్ధితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు జరగడంతో పాటు వివిధ సమయాల్లో విజేతల ప్రకటన చేస్తారు. ఇందులో తిరిగి ఓడిన వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది. అక్కడ కోర్టుల్లో వెంటనే విచారణ జరిపి క్లియరెన్స్ ఇస్తారు. అయితే ఈ ప్రక్రియ ఏదో విధంగా ఫలితాలపై ప్రభావం చూపుతుంది.












Click it and Unblock the Notifications